సీనియర్ హీరోయిన్ రాధిక పై వరలక్షీ కామెంట్స్..!

వరలక్ష్మీ శరత్ కుమార్.. ఈమె తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. కోలీవుడ్ సీనియర్ హీరో శరత్ కుమార్ కూతురే ఈ వరలక్ష్మీ. అంటే ఆయన భార్య రాధిక కూతురు కాదు.. మొదటి భార్య కూతురు. ఇటీవల విడుదలైన ‘క్రాక్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది వరలక్ష్మీ. అంతకు ముందు ఈమె ‘పందెం కోడి2’ ‘సర్కార్’ ‘తెనాలి రామకృష్ణ ఎల్.ఎల్.బి’ వంటి చిత్రాల్లో నటించినప్పటికీ రాని గుర్తింపు.. ‘క్రాక్’ లో జయమ్మ పాత్రతో తెచ్చుకుంది. ఇప్పుడు ఈ అమ్మడికి తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తుండడం విశేషం.

ఇదిలా ఉండగా..ఏ విషయాన్ని అయినా మొహమాట పడకుండా.. కుండబద్దలు కొట్టినట్టు చెప్పేస్తుంటుంది వరలక్ష్మీ. అలాగే ఇటీవల తన సవతి తల్లి అయిన రాధిక గురించి కూడా కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. “రాధిక గారు నా సొంత తల్లి కాదు. కానీ నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. అంతేకాదు నా కెరీర్ కు సంబంధించిన సలహాలు,రిఫరెన్స్ లు , గైడెన్స్ కూడా ఇస్తూ ఉంటుంది.

కాకపోతే నేను ఎప్పుడైనా ఆమెకు ఓ సీక్రెట్ చెబితే మాత్రం దాన్ని వెంటనే అందరికీ లీక్ చేసేస్తుంటుంది. అలా అని అందులో దురుద్దేశం ఉండదు. పొరపాటున జరిగిపోతుంటుంది.చాలా సార్లు ఇలా నా సీక్రెట్స్ ను బయటపెట్టేసి నన్ను ఇబ్బందులకు గురిచేసింది” అంటూ రాధిక గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది వరలక్ష్మి.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus