వరలక్ష్మీ శరత్ కుమార్‌తో అనిల్ కాట్జ్ దర్శకత్వంలో మహా మూవీస్ నిర్మిస్తున్న ‘శబరి’ చిత్రీకరణ పూర్తి

నటిగా ప్రేక్షకుల మనసులు దోచుకుంటూ… విలక్షణ పాత్రలు, వరుస విజయాలతో దూసుకు వెళుతున్న టాలీవుడ్ హ్యాపెనింగ్ లేడీ వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘శబరి’. మహా మూవీస్ పతాకంపై మహర్షి కూండ్ల సమర్పణలో మహేంద్రనాథ్ కూండ్ల నిర్మిస్తున్నారు. అనిల్ కాట్జ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది.

వరలక్ష్మీ శరత్ కుమార్ మాట్లాడుతూ ”మా ‘శబరి’ చిత్రీకరణ పూర్తయింది. మహేంద్ర గారి లాంటి నిర్మాత లభించడం మా అదృష్టం. సినిమా కోసం ఆయన చాలా ఖర్చు చేశారు. నేను పని చేసిన బెస్ట్ ప్రొడ్యూసర్లలో ఆయన ఒకరు. ఆయన ఇచ్చిన ప్రతి రూపాయిని దర్శకుడు అనిల్ తెరపైకి తీసుకొచ్చారు. మేము చాలా లొకేషన్లలో షూటింగ్ చేశాం. సినిమా బాగా వచ్చింది. ‘శబరి’లో ప్రధాన పాత్ర పోషించినందుకు సంతోషంగా ఉంది. రెండు మూడు రోజుల్లో డబ్బింగ్ చెప్పడం ప్రారంభిస్తా. త్వరలో ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తాం” అని చెప్పారు.

చిత్రనిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల మాట్లాడుతూ “ఇదొక స్ట్రాంగ్ ఎమోషనల్ థ్రిల్లర్. సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. వరలక్ష్మి గారు నిర్మాతల నటి. ఆమెతో సినిమా చేయడం సంతోషంగా ఉంది. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం” అని చెప్పారు.

చిత్ర దర్శకుడు అనిల్ కాట్జ్ మాట్లాడుతూ “కొత్త కథను తీసుకుని కమర్షియల్ హంగులతో సినిమా తెరకెక్కించాం. ఈ చిత్రం ఒక రకంగా థ్రిల్లర్ జానర్ మూవీ అయినప్పటికీ… సినిమాలో అన్ని భావోద్వేగాలు ఉంటాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలు సినిమాలో ఉన్నాయి. సినిమా అవుట్ పుట్ చాలా బాగా వచ్చింది. స్వతంత్ర భావాలున్న ఆధునిక యువతిగా, శబరి పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ అద్భుతంగా నటించారు. యాక్షన్ సీన్స్ కూడా చక్కగా చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉందీ సినిమా” అని అన్నారు.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus