Dil Raju: స్టేజీ మీద ఏవేవో మాటలు.. క్షమాపణ చెప్పిన దిల్‌ రాజు!

ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ఇటీవల జరిగిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలేఆయన సారీ చెప్పడానికి కారణం. నిజామాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో ఆయన ఎందుకు అలా అన్నారో తెలియదు కానీ.. ఆ వ్యాఖ్యలు మాత్రం వైరల్‌గా మారాయి. దీంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో సారీ చెప్పారు.

Dil Raju

తానూ తెలంగాణ వాడినేని.. తెలంగాణ సంస్కృతిని హేళన చేయడం తన ఉద్దేశం కాదని.. అలాగే ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించాలని దిల్‌ రాజు కోరారు. నిజామాబాద్‌లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ చేశాం. అక్కడ సినిమా ఈవెంట్స్‌ పెద్దగా జరగవు. గతంలో ‘ఫిదా’ సక్సెస్‌ మీట్‌ పెట్టాను. నిజామాబాద్‌ వాసిగా ఈ ప్రాంతంతో నాకున్న అనుబంధం అలాంటిది అని గుర్తు చేశారు.

తెలంగాణ సంస్కృతిలో భాగమైన దావత్‌ గురించి, మటన్‌, తెల్ల కల్లు గురించి మాట్లాడాను. ఆ మాటల్లో తెలంగాణ వాళ్లను అవమానించానని, అవహేళన చేశానని కొంతమంది కామెంట్లు చేసి, సోషల్‌ మీడియాలో పెట్టారని తెలిసింది. ‘తెలంగాణ దావత్‌ నేను మిస్సవుతున్నాను. సంక్రాంతికి వస్తున్న రెండు సినిమాలు విడుదలయ్యాక దావత్‌ చేసుకోవాలని ఉంది అని చెప్పటం నా ఉద్దేశం అని క్లారిటీ ఇచ్చారు.

నేను మన సంస్కృతిని అభిమానిస్తా. ఈ విషయం అర్థం చేసుకోకుండా కొంతమంది సోషల్‌ మీడియాలో నానా రాద్ధాంతం చేస్తున్నారు. నా మాటల వల్ల ఎవరైనా మనస్తాపం చెందితే క్షమించండి. సినిమా రంగంలో కిందిస్థాయి నుండి ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా ఎదిగాను. తెలంగాణలో తెలుగు సినిమా అభివృద్ధి చెందడంతో పాటు, యువతకు ఉపయోగపడేలా పనిచేస్తా. ఎఫ్‌డీసీకి రాజకీయాలతో సంబంధం లేదు. ఇలాంటి అనవసర విషయాల్లోకి నన్ను లాగొద్దని తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నా అని దిల్‌ రాజు పేర్కొన్నారు.

భారీ వసూళ్లు పోస్టర్లు.. సోషల్‌ మీడియాలో ఫ్యాన్‌ వార్లు.. మారండయ్యా బాబూ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus