శనివారం నాడు వరలక్ష్మీ శరత్ కుమార్ తన 36వ పుట్టినరోజు వేడుకని ఘనంగా జరుపుకుంది. ఈ వేడుకలో శరత్ కుమార్ ఫ్యామిలీతో పాటు రాధికా ఫ్యామిలీ కూడా పాల్గొంది. ఈ సందర్భంగా వరలక్ష్మీ తన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ.. ‘ఈ బర్త్ డే నాకు చాలా ప్రత్యేకమైనది. నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపినవారందరికీ నా ప్రత్యేక ధన్యవాదములు. మంచి, చెడు, అలాగే విషాదకరమైన సందర్భాలలో కూడా నాకు అండగా ఉన్న నా కుటుంబ సభ్యులు మరియు సన్నిహితులతో నా బర్త్ డే వీకెండ్ ను సెలబ్రేట్ చేసుకోవడం నాకు ఆనందంగా ఉంది.
నేను అధికారికంగా హైదరాబాద్ కు షిఫ్ట్ అవుతున్నాను.అందుకు కొంచెం భయంగా ఉంది. కానీ నాకోసం మంచి రోజులు అక్కడ ఎదురుచూస్తున్నాయనే నమ్మకం ఉంది. మీ అందరి ఆశీస్సులు, ప్రేమ మరియు మద్దతు నాకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని ఆశిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది వరలక్ష్మీ.తెలుగులో వరలక్ష్మీ వరుస ఆఫర్లను దక్కించుకోవడంతో ఆమె హైదరాబాద్ కు షిఫ్ట్ అవుతున్నట్టు స్పష్టమవుతుంది. ఇక ఆమె బర్త్ డే సెలబ్రేషన్స్ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :
1
2
3
4
5
6
7
8
9
10
11
Most Recommended Video
‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!