Varalaxmi Sarathkumar: సురేష్ కొండేటి తిక్క ప్రశ్నకు పగిలిపోయే ఆన్సర్ ఇచ్చిన వరలక్ష్మి..!

ఈ మధ్యకాలంలో మీడియా రిపోర్టర్స్ స్టార్ సెలబ్రిటీస్ ని ఎలాంటి ప్రశ్నలతో విసుకెత్తిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది సురేష్ కొండేటి . ఈ మధ్యకాలంలో ఏ సినిమా ఈవెంట్ లో అయినా.. ప్రెస్మీట్లో అయినా ..సరే హైలెట్ గా మారుతున్నాడు . సురేష్ కొండేటి రీసెంట్గా అలాంటి ఓ ప్రశ్నతో వరలక్ష్మి శరత్ కుమార్కు విసుగు తెప్పించాడు . దీంతో స్టేజి పైన లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది వరలక్ష్మి శరత్ కుమార్ . తాజాగా నటించిన సిరీస్ మెన్షన్ 24 . రాజు గారి గది చిత్రాల దర్శకుడు ఓంకార్ ఈ సిరీస్ ను తెరకెక్కిస్తున్నాడు.

సత్యరాజ్ ఈ సిరీస్ లో కీ రోల్ ప్లే చేస్తూ ఉండగా తదితరులు.. ఈ సిరీస్ లో నటిస్తున్నారు. ఈ సిరీస్ అక్టోబర్ 17 నుండి ప్రముఖ ఓటీటీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది . ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ అభిమానులను బాగా ఆకట్టుకుంది . ఈ క్రమంలోనే తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా ప్రెస్ మీట్ నిర్వహించారు . రిపోర్టర్స్ అడిగిన ప్రశ్నలకు చాలా ఓపికగా సమాధానం చెబుతూ వచ్చిన వరలక్ష్మి శరత్ కుమార్ జర్నలిస్టు సురేష్ కొండేటి అడిగిన ప్రశ్నకు మాత్రం ఫుల్ ఫైర్ అయిపోయింది.

” మీరు దయ్యాలను నమ్ముతారా..?” అని అడిగాడు . దానికి సమాధానంగా (Varalaxmi Sarathkumar) వరలక్ష్మి “ఎస్ నమ్ముతాను” అంటూ చెప్పుకొచ్చింది . అప్పుడు మళ్లీ మైక్ తీసుకున్న సురేష్ “దెయ్యాన్ని ఇష్టపడతారా..? దేవుని నిష్టపడతారా ..?”అంటూ అడిగాడు . దీంతో కోపం పీక్స్ కి వెళ్ళిపోయిన వరలక్ష్మి..” ఏం మాట్లాడుతున్నారండి..? దెయ్యాలను ఎవరైనా ఇష్టపడతారా..? ఇది అసలు ప్రశ్నే నా..? మీకు దయ్యం అంటే ఇష్టం లా ఉంది ” అంటూ తిరిగి క్వశ్చన్ చేసింది .

దానికి మళ్లీ మైక్ తీసుకున్న సురేష్ కొండేటి ” మీ దర్శకుడు ఓంకార్ కి బాగా ఇష్టం అనుకుంటాను ” అంటూ కౌంటర్ వేస్తాడు . దీంతో వెంటనే మైక్ అందుకున్న ఓంకార్ “నాకు దయ్యాలంటే ఇష్టమని మీకు ఎవరు చెప్పారు ..? నేను నీకు చెప్పానా ..? అంటూ సీరియస్ అయిపోతాడు .. అయితే చాలా మంది ఇలాంటి ప్రశ్నలకు అడగడానికి ఆయన కి సిగ్గులేదా..? అంటూ మండిపడుతున్నారు. ఇదే వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది..

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus