గ్లామర్ పాత్రలకు గుడ్ బై.. విలన్ గానే కొనసాగుతా వరలక్ష్మి కామెంట్స్ వైరల్!

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో నటిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సీనియర్ నటుడు శరత్ కుమార్ కుమార్ వారసురాలు వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరిని చెప్పాలి. ఈమెపోడా పోడి సినిమా ద్వారా హీరో శింబుకు హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అయితే ఈమె హీరోయిన్ గా చాలా తక్కువ సినిమాలలో నటించారని చెప్పాలి.ప్రస్తుతం వరలక్ష్మి శరత్ కుమార్ అరడజనకు పైగా సినిమా అవకాశాలను చేతిలో పెట్టుకున్నారు.

తాజాగా ఈమె బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా ద్వారా విలన్ పాత్రలో మరోసారి తన విశ్వరూపం చూపించడానికి సిద్ధమయ్యారు. వరలక్ష్మి శరత్ కుమార్ ఎక్కువగా సినిమాలలో గ్లామరస్ పాత్రలలో కాకుండా విలన్ పాత్రలలో చేయడానికి గల కారణం ఏంటి అనే విషయం గురించి వెల్లడించారు.ఈ విషయం గురించి వరలక్ష్మీ మాట్లాడుతూ తాను గ్లామరస్ పాత్రలకు సూట్ అవ్వనని అలాంటి పాత్రలు చేయడానికి చాలామంది ఉన్నారని ఈమె తెలిపారు.

ఇలా గ్లామరస్ పాత్రలు తనకు పెద్దగా సూట్ అవ్వకపోవడం వల్లే తాను ఆ పాత్రలకు దూరంగా ఉండి విలన్ పాత్రలను ఎంపిక చేసుకున్నానని తెలిపారు. విలన్ పాత్రలకు తాను కరెక్ట్ గా సరిపోతానని అందుకే ఇకపై ఇండస్ట్రీలో విలన్ పాత్రలలోనే నటిస్తానని తెలిపారు.ఇక విలన్ గా కొన్ని పాత్రలు కేవలం తాను మాత్రమే నటించగలనని,

అందుకే తనకు అలాంటి అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయని ఈ సందర్భంగా వరలక్ష్మి శరత్ కుమార్ చేసినటువంటి కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇలా హీరోయిన్ గా కాకుండా ప్రతినాయకి పాత్రలలో నటిస్తూ తాను చాలా సంతోషంగా ఉన్నానని ఈ సందర్భంగా ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus