వరలక్ష్మీ శరత్ కుమార్.. తమిళ సీనియర్ స్టార్ హీరో శరత్ కుమార్ కూతురు అనే సంగతి అందరికీ తెలిసిందే. కెరీర్ ప్రారంభంలో హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది. కానీ అవి సక్సెస్ కాలేదు. నటిగా కూడా ఈమె రాణించింది అంటూ ఏమీ లేదు. దీంతో తమిళ సినిమాల్లో లేడీ విలన్ రోల్స్ చేయడం మొదలుపెట్టింది. అలా అని అప్పుడు కూడా సక్సెస్ అయ్యింది అంటూ ఏమీ లేదు. అయితే 2019 లో వచ్చిన సందీప్ కిషన్ ‘తెనాలి రామకృష్ణ బిఎ బిఎల్’ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది.
ఆ సినిమాలో ఈమె నటన హైలెట్ అనే చెప్పాలి. కానీ సినిమా ఆడలేదు. అయితే 2021 లో ఈమె ‘క్రాక్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో జయమ్మ పాత్రలో మంచి నటన కనపరిచింది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో తెలుగులో ఈమెకు మంచి ఛాన్సులు లభించాయి. ఆ తర్వాత ‘నాంది’ ‘యశోద’ వంటి హిట్ సినిమాల్లో కూడా నటించింది.
ఇదిలా ఉండగా.. వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar) నటించిన సినిమాలు సంక్రాంతికి కనుక రిలీజ్ అయితే సూపర్ హిట్లు కొడుతున్నాయి. 2021 లో వచ్చిన రవితేజ ‘క్రాక్’ అతని కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 2023 లో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ లో కూడా వరలక్ష్మీ .. బాలకృష్ణ చెల్లెలి పాత్రలో నటించింది. ఈ సినిమా కూడా బాలయ్య కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
ఇక 2024.. ఈ సంక్రాంతికి వచ్చిన ‘హను-మాన్’ సినిమాలో కూడా వరలక్ష్మీ నటించింది. అంజమ్మ అనే పాత్రలో ఈమె చాలా బాగా నటించింది. ఈ సినిమా కూడా యంగ్ హీరో తేజ సజ్జ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇలా ‘జయమ్మ’ టు ‘అంజమ్మ’ పాత్రలను బట్టి ఆ సినిమాల ఫలితాలను బట్టి.. సంక్రాంతి సినిమాలకి వరలక్ష్మీ లక్కీ ఛార్మ్ గా మారిపోయింది అని చెప్పాలి.
గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!
హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!