Varalaxmi Sarathkumar: వరలక్ష్మీ శరత్ కుమార్.. యోగా వర్కౌట్ల వీడియో వైరల్..!

ఒకప్పటి హీరో శరత్ కుమార్ కూతురు అయిన వరలక్ష్మీ ..వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది. హీరోయిన్ గా ఆమె రాణించలేకపోయినా నెగిటివ్ రోల్స్ పోషించి మంచి క్రేజ్ నే సంపాదించుకుంది. ప్రస్తుతం ఉన్న బిజీ ఆర్టిస్ట్ లలో ఈమె కూడా ఒకరు. ‘క్రాక్’ ‘నాంది’ వంటి చిత్రాలతో తెలుగులో కూడా ఈమె మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో కూడా కీలక పాత్రని పోషిస్తుంది వరలక్ష్మి.

టాలీవుడ్ దర్సకనిర్మాతలు ఈమె కాల్ షీట్ల కోసం ఎగబడుతున్నారు. కానీ ఈమె మాత్రం ఆచి తూచి అడుగులు వేస్తుంది. ఇక గతంలో వరలక్ష్మీ బొద్దుగా ఉండేదన్న సంగతి తెలిసిందే. ఆ టైములో ఈమె లుక్ పై ట్రోలింగ్ కూడా జరిగేది. అయినప్పటికీ ఈమె ఆ ట్రోల్స్ ను పట్టించుకునేది కాదు. కానీ తర్వాత ఈమె స్లిమ్ గా తయారయ్యింది.దాంతో హీరోయిన్ల కంటే కూడా ఎంతో గ్లామర్ గా కనిపిస్తుంది ఈ నటి.

అలా అని ఈమె స్లిమ్ అవ్వడానికి సర్జెరీల వంటి జోలికి వెళ్ళలేదు. యోగాసనాలు, వర్కౌట్లు వంటివి చేసి స్లిమ్ అయ్యింది. ఇటీవల ఆమె యోగాసనాలు చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఇందులో ఆమె వర్కౌట్లు చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. తలక్రిందులుగా వ్రేలాడుతూ ఈమె చేసిన భంగిమలు మాములుగా లేవు. ఆ వీడియోని మీరు కూడా ఓ లుక్కేయండి :


1

2

3

More….

1

2

3

4

5

More…

1

2

3

4

5

6

7

8

9

10

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus