Varasudu: వంశీ పైడిపల్లి వల్ల వారసుడు మూవీకి అంత నష్టమా?

సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన వారసుడు మూవీ తమిళంలో బాగానే కలెక్షన్లను సాధిస్తున్నా తెలుగులో మాత్రం ఈ సినిమాకు చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లు రావడం లేదు. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలకు భారీ స్థాయిలో కలెక్షన్లు వస్తుండగా వారసుడు సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవడం లేదు. అయితే ఈ సినిమాలో కట్ చేసిన సీన్లు కూడా ఎక్కువగానే ఉన్నాయని సమాచారం. దాదాపుగా 20 నిమిషాల నిడివి ఉన్న సీన్లు కట్ చేశారని 10 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన సన్నివేశాలు వృథా అయ్యాయని సమాచారం అందుతోంది.

వంశీ పైడిపల్లి ఎక్కువ సీన్లను షూట్ చేయడం వల్ల నష్టం కలిగిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వారసుడు దిల్ రాజుకు సేఫ్ ప్రాజెక్టా? కాదా? అనే ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందేనని కామెంట్లు వినిపిస్తున్నాయి. వారసుడు సినిమా 250 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిందని సమాచారం. అయితే ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడయ్యాయని తెలుస్తోంది. కొన్నేళ్ల క్రితం వరకు పరిమిత బడ్జెట్ తో సినిమాలు తీసిన దిల్ రాజు ప్రస్తుతం రూట్ మార్చారనే సంగతి తెలిసిందే.

దిల్ రాజు రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది. ఇతర భాషల్లో కూడా దిల్ రాజు పాపులర్ అవుతున్నారు. దిల్ రాజు నిర్మాతగా రాజమౌళి డైరెక్షన్ లో ఒక సినిమా తెరకెక్కితే బాగుంటుందని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దిల్ రాజు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఒక ప్రాజెక్ట్ ను ఫిక్స్ చేశారు.

దిల్ రాజు భవిష్యత్తులో మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ ల దిశగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. దిల్ రాజుకు పెద్ద సినిమాల ద్వారా భారీ మొత్తం మిగులుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. దిల్ రాజు నిర్మాతగా తన స్థాయిని అంతకంతకూ పెంచుకుంటున్నారు.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus