ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ఒక్కరోజు గ్యాప్ తో బాలయ్య వీరసింహారెడ్డి, చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలు థియేటర్లలో విడుదల కాగా ఈ రెండు సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించాయి ఈ సినిమాలు ఇప్పటికే ఓటీటీలో అందుబాటులోకి రావడంతో పాటు బుల్లితెరపై కూడా ప్రదర్శితమయ్యాయి. అభిమనులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ సినిమాలు బుల్లితెరపై మంచి రేటింగ్ ను సొంతం చేసుకున్నాయి. అయితే చిరంజీవి బాలయ్య ఫ్యాన్స్ మధ్య వెరైటీ పోటీ నెలకొంది.
ఏపీలోని ఒక థియేటర్ లో ఇప్పటికీ వీరసింహారెడ్డి ప్రదర్శితం అవుతుండగా ఏపీలోని మరో థియేటర్ లో వాల్తేరు వీరయ్య సినిమా ప్రదర్శితమవుతోంది. వాల్తేరు వీరయ్య అవనిగడ్డలోని రామకృష్ణ థియేటర్ లో ప్రదర్శితమవుతుండగా వీరసింహారెడ్డి ఆలూరులోని శ్రీ లక్ష్మీ నరసింహ థియేటర్ లో ప్రదర్శితమవుతోంది. ఈ రెండు సినిమాలలో ఏ సినిమా ఎక్కువ రోజుల పాటు థియేటర్లలో ప్రదర్శితమవుతుందో చూడాల్సి ఉంది. ఫ్యాన్స్ ప్రెస్టీజియస్ గా తీసుకుని ఈ రెండు సినిమాలను థియేటర్లలో ఆడిస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
గతంలో కొన్ని సినిమాలు థియేటర్లలో 1000 కంటే ఎక్కువ రోజులు ప్రదర్శితం కాగా ఈ సినిమాలు కూడా ఆ జాబితాలో నిలుస్తాయేమో చూడాల్సి ఉంది. ఈ సినిమాలు అరుదైన రికార్డులను క్రియేట్ చేయడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య నటించిన భగవంత్ కేసరి రిలీజ్ కు మరో మూడు వారాల సమయం మాత్రమే ఉంది. ఆలూరులోని థియేటర్ లో వీరసింహారెడ్డిని ఈ సినిమా భర్తీ చేస్తుందా? లేక వీరసింహారెడ్డి కొనసాగుతుందా? అనే ప్రశ్నలకు జవాబు దొరకాల్సి ఉంది.
చిరంజీవి, బాలయ్య (Chiranjeevi, Balakrishna) తర్వాత ప్రాజెక్ట్ లపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. చిరంజీవి, బాలయ్య కలిసి నటిస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చిరంజీవి, బాలయ్య పారితోషికాలు భారీ రేంజ్ లో ఉన్నాయి. ఈ హీరోలు తర్వాత సినిమాలతో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాల్సి ఉంది.
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!