Varisu: దిల్ రాజు పాన్ ఇండియా హిట్ సాధించినట్టేనా?

2023 సంక్రాంతి కానుకగా విడుదలైన వారిసు మూవీ రిజల్ట్ కోసం తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే వారిసు ట్రైలర్ తెలుగు ప్రేక్షకులకు రొటీన్ గా అనిపించినా తమిళ ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా నచ్చేసింది. తొలిరోజు ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు వచ్చాయని సమాచారం అందుతోంది. కలెక్షన్ల పరంగా దిల్ రాజు సేఫ్ అయినట్టేనని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం. దిల్ రాజు నిర్మాతగా పాన్ ఇండియా హిట్ సాధించినట్టేనని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

శంకర్ చరణ్ కాంబో మూవీతో కూడా సక్సెస్ సాధిస్తే మాత్రం దిల్ రాజుకు తిరుగుండదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వారిసు మూవీకి తునివు మూవీతో పోల్చి చూస్తే బెటర్ టాక్ రావడం కూడా సినిమాకు ఒక విధంగా ప్లస్ అయిందని చెప్పవచ్చు. దిల్ రాజుకు ఈ సినిమాతో భారీ లాభాలు గ్యారంటీ అని చెప్పవచ్చు. దిల్ రాజు ఖర్చు విషయంలో అస్సలు రాజీ పడకపోవడంతో తమిళ ప్రేక్షకులు దిల్ రాజు బ్యానర్ నిర్మాణ విలువలకు సైతం ఫిదా అవుతున్నారు.

విజయ్ గత సినిమా బీస్ట్ తో పోల్చి చూస్తే మాత్రం వారసుడు మూవీ ఎన్నో రెట్లు బెటర్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. వారసుడు తెలుగులో కూడా సక్సెస్ సాధిస్తే విజయ్ కు మార్కెట్ పరంగా ప్లస్ అవుతుందని చెప్పవచ్చు. ఇతర భాషల్లో మార్కెట్ ను పెంచుకుని నటుడిగా తన స్థాయిని పెంచుకోవాలని విజయ్ భావిస్తున్నారు. విజయ్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లు కూడా తెలుగులో సక్సెస్ సాధిస్తే అతనికి తిరుగుండదు.

కెరీర్ పరంగా తప్పటడుగులు పడకుండా విజయ్ నిర్ణయాలు తీసుకుంటే మాత్రం అతని కెరీర్ కు తిరుగుండదని చెప్పవచ్చు. విజయ్ కెరీర్ విషయంలో ఏ విధంగా అడుగులు వేస్తారో చూడాల్సి ఉంది. వారిసు సక్సెస్ తో విజయ్ క్రేజ్ మరింత పెరిగింది.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus