Varasudu: వారసుడు మూవీ బిజినెస్ కు కలెక్షన్లకు పొంతన లేదా?

సంక్రాంతి పండుగ కానుకగా తెలుగు రాష్ట్రాలలో విడుదలైన సినిమాలలో కళ్యాణం కమనీయం మినహా మిగిలిన సినిమాలన్నీ కమర్షియల్ గా సక్సెస్ సాధించి ప్రేక్షకుల అంచనాలను మించి హిట్ గా నిలిచాయి. సంక్రాంతి సినిమాలు క్రిటిక్స్ ను అంచనాలను మించి మెప్పించలేకపోయినా ప్రేక్షకులకు మాత్రం తెగ నచ్చాయి. తమిళంలో విజయ్ హీరోగా తెరకెక్కిన వారిసు మూవీ వారం రోజుల్లో 210 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది.

ఫ్యామిలీ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా అక్కడి ప్రేక్షకులను మెప్పించింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఈ సినిమా 250 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. ఈ సినిమా షేర్ కలెక్షన్లు 160 నుంచి 180 కోట్ల రూపాయల మధ్య ఉండే ఛాన్స్ అయితే ఉంది. వారిసు సినిమా కోసం విజయ్ ఏకంగా 105 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నారు. వారిసు మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కడంతో ఈ సినిమా ఇప్పటికీ బ్రేక్ ఈవెన్ కాలేదని తెలుస్తోంది.

వారిసు మూవీ బిజినెస్ కు కలెక్షన్లకు పొంతన లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. వారిసు మూవీ బయ్యర్లకు నష్టాలు గ్యారంటీ అని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ కామెంట్ల గురించి దిల్ రాజు స్పందన ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి ఉంది. దిల్ రాజు మాత్రం భవిష్యత్తు సినిమాలను కూడా స్టార్ హీరోలతోనే తెరకెక్కించాలని భావిస్తున్నారని తెలుస్తోంది.

తమిళ స్టార్ హీరోలతో ఎక్కువగా సినిమాలను నిర్మిస్తున్న దిల్ రాజు తెలుగు హీరోలతో సినిమాలను ఎప్పుడు నిర్మిస్తారో చూడాల్సి ఉంది. పభాస్ దిల్ రాజు కాంబోలో ఒక సినిమా వచ్చే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారం నిజమవుతుందో లేదో చూడాల్సి ఉంది. అయితే దిల్ రాజు మాత్రం సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ లో ఒకరిగా ఉన్నారు.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus