Vijay vs Ajith: తమిళంలో బుకింగ్స్ విషయంలో ఆ హీరో పైచేయి సాధించారా?

సంక్రాంతి పండుగ కానుకగా తమిళనాడులో విజయ్ హీరోగా తెరకెక్కిన వారిసు, అజిత్ హీరోగా తెరకెక్కిన తునివు సినిమాలు ఒకేరోజు థియేటర్లలో విడుదలవుతున్నాయి. రికార్డ్ స్థాయి స్క్రీన్లలో ఈ సినిమాలు రిలీజవుతుండగా ఈ రెండు సినిమాలకు సమానంగా థియేటర్లు దక్కాయని బోగట్టా. అయితే ఈ రెండు సినిమాలలో పైచేయి సాధించిన సినిమా ఏదనే ప్రశ్నకు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బుక్ మై షో చెన్నై బుకింగ్స్ ను పరిశీలిస్తే లైక్స్ విషయంలో తెగింపు పైచేయి సాధించింది.

తునివు సినిమా 2 గంటల 26 నిమిషాల నిడివితో రిలీజ్ కానుండగా వారిసు సినిమా మాత్రం ఏకంగా 2 గంటల 50 నిమిషాల నిడివితో విడుదలవుతోంది. రెండు సినిమాలకు ఫస్ట్ డే టికెట్లు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. చెన్నైలో వారిసు సినిమాకే ఎక్కువ స్క్రీన్లు దక్కాయని సమాచారం అందుతోంది. ప్రముఖ మల్టీప్లెక్స్ లలో ఇద్దరు హీరోలకు సమానంగా స్క్రీన్లను కేటాయించారు. చెన్నైలోని మాయాజల్ మల్టీప్లెక్స్ లో వారిసు 39 షోలు ప్రదర్శితం కానుండగా తునివు కూడా 39 షోలు ప్రదర్శితం అవుతోంది.

కొన్ని థియేటర్లలో రెండు సినిమాలు రిలీజవుతుండగా ఒక్కో చోట ఒక్కో సినిమా ఆధిపత్యం ఉండటం గమనార్హం. బుకింగ్స్ పరంగా ప్రస్తుతం 51 శాతం వారిసు టికెట్ల బుకింగ్ జరిగితే 49 శాతం తునివు టికెట్ల బుకింగ్ జరిగింది. ఈ రెండు సినిమాల టికెట్ల బుకింగ్ పోటాపోటీగా జరుగుతోంది. ఈ రెండు సినిమాలలో ఏ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఆ సినిమాకు 12వ తేదీ నుంచి కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది.

మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో వారసుడు, తెగింపు సినిమాలకు అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుకాలేదు. ఈ రెండు సినిమాలు సక్సెస్ సాధించాలని తమిళనాడు ప్రేక్షకులు కోరుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో స్ట్రెయిట్ సినిమాలకు సమానంగా వారసుడు మూవీ థియేటర్లలో రిలీజ్ కానుండటం గమనార్హం.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus