సినిమా ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చిన హీరోయిన్‌కి ఎలాంటి ఆలోచనలు ఉంటాయి. వరుసగా సినిమాలు చేసేయాలి, ఏ హీరోయిన్‌కీ రానంత మంచి గ్లామరస్ రోల్ రావాలి, నటనకు ప్రాధాన్యమున్న సినిమాలు ఉండాలి. అప్పుడు గ్లామర్ డాళ్‌లా కనిపిస్తూనే.. మంచి పాత్రలు చేయొచ్చు అనుకుంటుంది. అయితే వర్ష బొల్లమ్మ మాత్రం మంచి సైకో పాత్ర కావాలి, విలన్ అవ్వాలి అంటోంది. ఎందుకలా అంటోంది, ఇంకే చెప్పిందో ఓసారి చదివేయండి. సహజత్వానికి దగ్గరగా ఉండే కథలంటే ఇష్టమని చెప్పిన వర్ష బొల్లమ్మ..
‘స్వాతిముత్యం’లోని పాత్ర కూడా దాదాపు అలాంటిదే. కొత్తదనం ఉంటూనే.. పాత్రల్లో డెప్త్ బాగుంటుంది. అందరికీ నచ్చుతుంది అని నమ్మకంగా చెప్పింది వర్ష. ఇక బయట వస్తున్న పుకార్లలా హిందీలో ‘విక్కీ డోనర్’కి ‘స్వాతిముత్యం’ సినిమాకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. కథలోని ఓ అంశం విషయంలో పోలిక మాత్రమే ఉంటుందట. మిగతా అంతా భిన్నంగానే సాగుతుందట.‘బిగిల్’ సినిమాలో ఫుట్‌బాల్ క్రీడాకారిణిగా కీలక పాత్రలో నటించిన వర్ష బొల్లమ్మకు అన్ని రకాల పాత్రలు చేయడం అంటే ఇష్టమట.
అయితే ప్రేక్షకులు తనను మొదటి నుండీ మధ్యతరగతి అమ్మాయిగానే చూడటానికే ఇష్టపడుతున్నారు అని చెబుతోంది. ‘మన పక్కింటి అమ్మాయిలా ఉందే ఈ అమ్మాయి’ అని ప్రేక్షకులు అనుకోవడం వల్లే ఆ తరహా పాత్రలు ఎక్కువ పేరు తీసుకొస్తున్నాయి అని చెప్పింది వర్ష. ఇక చేయాలనుకుంటున్న పాత్రల గురించి కూడా చెప్పింది వర్ష.
అందరినీ బయపెట్టే పాత్రలే అయినప్పటికీ సైకో పాత్రలు, ప్రతినాయిక ఛాయలున్న పాత్రలు బాగా చేయగలనని ఆమె నమ్మకమట. అందుకే అలాంటి పాత్రలు ఏమైనా వస్తాయేమో అని చూస్తోందట. ఇంకెందకు ఆలస్యం రైటర్స్, డైరక్టర్స్ అలాంటి పాత్రలు మీ మనసులో ఉన్నా, పేపర్ మీద ఉన్నా వర్ష బొల్లమ్మ అయితే చేయడానికి రెడీగా ఉంది. అన్నట్లు ఆమె నెక్స్ట్ సినిమా చెప్పలేదు కదా. ప్రస్తుతం తెలుగులో సందీప్ కిషన్‌తో ఓ సినిమా చేస్తోంది.