ఆకట్టుకుంటున్న ‘కృష్ణ వ్రింద విహారి’ మొదటి పాట..!

నాగ శౌర్య హీరోగా నటిస్తున్న ‘కృష్ణ వ్రింద విహారి’ చిత్రంలో నుండీ మొదటి పాటని కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. ‘వర్షంలో వెన్నెల’ అంటూ సాగే ఈ రొమాంటిక్ సాంగ్ ను సమంత లాంచ్ చేయడం జరిగింది. మహతి స్వర సాగర్ కంపోజ్ చేసిన మెలోడీకి హీరో నాగ శౌర్య మరియు హీరోయిన్ షిర్లీ ల కెమిస్ట్రీ మరింత హైలెట్ గా నిలిచే విధంగా ఉంది అనే చెప్పాలి. లిరికల్ సాంగ్ కాబట్టి..

ఇందులో ఎక్కువ విజువల్స్ చూపించలేదు కానీ సినిమాలో ఈ పాట కూల్ అండ్ బ్రీజీగా సాగేలా ఉంటుందని స్పష్టమవుతుంది.సంజన కల్మంజే మరియు ఆదిత్య ఆర్కే ఈ పాటని పాడిన తీరు మంత్రముగ్ధుల్ని చేసే విధంగా ఉందని చెప్పాలి. శ్రీమణి ఈ పాటకి లిరిక్స్ అందించడం జరిగింది. పాట వినడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇక రామ్-కామ్‌ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 22న విడుదల కాబోతుంది.

‘ఐరా క్రియేషన్స్’ బ్యానర్ పై ఉషా ముల్పూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలోసీనియర్ నటి రాధిక శరత్‌కుమార్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ‘శంకర్ ప్రసాద్ ముల్పూరి’ సమర్పకులుగా వ్యవహరిస్తుండగా… సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నాడు. ఎడిటింగ్ తమ్మిరాజు గారు చేస్తుండడం విశేషం.’కృష్ణ వ్రింద విహారి’ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ లభించడంతో సినిమా పై కూడా క్రేజ్ పెరిగింది. ఈ పాట ఆ అంచనాల్ని మరింత పెంచిందనే చెప్పాలి.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!


‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Share.