నాగ శౌర్య , రీతు వర్మ జంటగా లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతూ చేసిన లేటెస్ట్ లవ్ & ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ‘వరుడు కావలెను’. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది.టీజర్, ట్రైలర్ లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దాంతో అక్టోబర్ 29న(నిన్న) విడుదలైన ఈ చిత్రం మంచి ఓపెనింగ్స్ నే నమోదు చేసింది.టాక్ కూడా పాజిటివ్ గా రావడంతో ‘వరుడు’ కి కలిసొచ్చినట్టు అయ్యింది.
ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం
0.42 cr
సీడెడ్
0.15 cr
ఉత్తరాంధ్ర
0.11 cr
గుంటూరు
0.14 cr
ఈస్ట్
0.09 cr
వెస్ట్
0.07 cr
కృష్ణా
0.08 cr
నెల్లూరు
0.06 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
1.12 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
0.07 Cr
ఓవర్సీస్
0.35 Cr
వరల్డ్ వైడ్ (టోటల్)
1.54 cr
‘వరుడు కావలెను’ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ.8.44 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.8.55 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ చిత్రం రూ.1.54 కోట్ల షేర్ ను రాబట్టింది. మరో రూ.7 కోట్ల షేర్ ను రాబడితే బ్రేక్ ఈవెన్ సాధించినట్టే..!కర్నాటకలో థియేటర్లు మూతపడడం అనేది ఈ సినిమాకి ఓ మైనస్. ఇక రెండో రోజు నుండీ పికప్ అయితే తప్ప ఈ చిత్రానికి అది సాధ్యపడదు.