Varudu Kaavalenu Teaser: నాగశౌర్య ఖాతాలో మరో హిట్ గ్యారంటీ!

యంగ్ హీరో నాగశౌర్య, రీతూవర్మ హీరోహీరోయిన్లుగా లక్ష్మీ సౌజన్య డైరెక్షన్ లో తెరకెక్కుతున్న వరుడు కావలెను టీజర్ తాజాగా విడుదలైంది. 30 సంవత్సరాల వయస్సు వచ్చినా పెళ్లి కాని యువతి పాత్రలో రీతూవర్మ ఈ సినిమాలో నటించారు. ఏ పెళ్లి సంబంధం వచ్చినా వచ్చినా పెళ్లికొడుకు తనకు కనెక్ట్ కావడం లేదని చెబుతూ రీతూవర్మ వచ్చిన పెళ్లి సంబంధాలను రిజెక్ట్ చేస్తూ ఉంటారు. అయితే రీతూవర్మ అందం, పొగరు చూసి నాగశౌర్య మాత్రం తొలిచూపులోనే ఆమెను ఇష్టపడతారు.

“ఫ్లర్టింగ్ లో ఏమైనా కోర్స్ చేసి వచ్చావా”, “నువ్వు వచ్చిన పని చూసుకొని వెళ్లు” అంటూ సింపుల్ డైలాగ్స్ ను కూడా తనదైన శైలిలో చెప్పి రీతూవర్మ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఛలో తర్వాత ఆ స్థాయి హిట్ లేని నాగశౌర్య, భారీ బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురు చూస్తున్న రీతూవర్మ ఈ సినిమాతో ఖచ్చితంగా హిట్ సాధిస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. యువతను ఆకట్టుకునేలా టీజర్ ఉండటంతో పాటు రొటీన్ కథనే లక్ష్మీ సౌజన్య కొత్తగా చూపించే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది.

వెన్నెల కిషోర్, ప్రవీణ్ టీజర్ లో చెప్పిన కామెడీ డైలాగులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. నాగశౌర్య తనకు సూటయ్యే పాత్రను ఎంచుకున్నారు. ఫ్యామిలీ లవ్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుండగా నదియా, మురళీ శర్మ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అక్టోబర్ నెలలో ఈ సినిమా రిలీజ్ కానుంది. విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకు స్వరాలను సమకూరుస్తున్నారు.


చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus