Varun Dhawan: త్రివిక్రమే కాదు ఆయన కూడా సమంత ఫ్యాన్‌ అట.. ఎవరంటే?

మొన్నీమధ్య ఆలియా భట్‌ (Alia Bhatt) సినిమా ‘జిగ్రా’ (Jigra) ప్రచారం కోసం సమంత హైదరాబాద్‌ వచ్చినప్పుడు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ ఆమెను ఆకాశానకెత్తేశారు. సౌత్‌తో అన్ని భాషల్లో స్టార్‌ అనిపించుకునే నటుల్లో సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ (Rajinikanth) తర్వాత సమంత (Samantha) అంటూ పెద్ద ఎత్తున పొగిడేశారు. దీంతో ఏంటి సామ్‌ అంటే త్రివిక్రమ్‌కు (Trivikram) అంత అభిమానమా.. అంతలా పొగిడేయాలా అనే మాటలు వినిపించాయి. అయితే ఇప్పుడు మరో దర్శకుడు కూడా ఆమెకు ఫ్యాన్‌ అని తెలిసింది.

Varun Dhawan

సమంత తమిళంలో చేసిన సినిమాలు ఎక్కువ కాకపోయినా చేసిన సినిమాల్లో అట్లీ (Atlee Kumar) ఆమెకు భారీ విజయాలు అందించారు. ఆ సినిమాలు చేసినప్పుడు వచ్చిన పరిచయమో, లేక ఇతర సినిమాలు చూశాక ఏర్పడిన పరిచయమో కానీ.. సమంత అంటే అట్లీకి చాలా అభిమానమట. ఈ విషయాన్ని సమంతతో ప్రస్తుతం ఓ వెబ్‌ సిరీస్‌ చేసిన, అట్లీతో ఇప్పుడు కలసి పని చేస్తున్న బాలీవుడ్‌ హీరో వరుణ్‌ ధావన్‌ చెప్పాడు. ‘సిటడెల్‌: హనీ బన్నీ’ వెబ్‌ సిరీస్‌ ప్రచారంలో భాగంగా ఈ విషయాలు చర్చలోకి వచ్చాయి.

సమంత, వరుణ్ ధావన్‌ (Varun Dhawan) కాంబినేషన్‌లో ‘సిటాడెల్‌: హనీ బన్ని’ సిరీస్‌ తెరకెక్కింది. రాజ్‌ – డీకే దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్ నవంబర్‌ 7 నుండి అమెజాన్‌ ప్రైమ్‌లో టెలీకాస్ట్‌ కాబోతోంది. ఈ నేపథ్యంలో టీమ్‌ వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉంది. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ కోలీవుడ్‌ స్టార్‌ దర్శకుడు అట్లీ కూడా సమంత వర్క్‌కు అభిమానే అని వరుణ్‌ చెప్పాడు. సమంతను అట్లీ ఎన్నోసార్లు ప్రశంసించారని, ఆమెను ‘సూపర్‌ స్టార్‌’ అనే పిలుస్తాడని చెప్పాడు.

సమంత అద్భుతమైన నటి అని, చాలా ప్రొఫెషనల్‌గా ఉంటుందని, ఆమెతో కలసి నటించిన సన్నివేశాలు సరదాగా అనిపించాయని, సినిమాపై మా ఇద్దరికి ఉన్న అభిరుచి వల్ల త్వరగా కనెక్ట్‌ అయ్యామని వరుణ్‌ చెప్పాడు. ఇప్పటికే సమంత నటించి ‘ఫ్యామిలీ మ్యాన్‌ 2’ సిరీస్‌ భారీ విజయం అందుకుంది. ఈ సిరీస్‌ ఫలితం కూడా అలానే ఉంటుందని ఆశిస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus