Varun Dhawan, Samantha: సమంత కోసం వరుణ్‌ ధావన్‌ ఏం చేశాడంటే..!

హీరోయిన్‌ బయటికొస్తే ఆలస్యం… కెమెరా కళ్లు చక్‌ చక్‌ చక్‌ అంటూ క్లిక్‌ మనేస్తాయి. వీడియోలు జీబీలకు జీబీలు రికార్డు అయిపోతాయి. అయితే ఇదంతా ఫ్యాన్స్‌కు సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌కు అందించడానికే అనే విషయం మరచిపోకూడదు. రోజూ ముంబయిలో తిరిగే హీరోయిన్లు కనిపిస్తేనే ఇలా ఉంటుంది. అలాంటి సౌత్‌ మోస్ట్‌ హ్యాపెనింగ్‌ హీరోయిన్‌ అయిన సమంత… ముంబయి వెళ్తే ఎలా ఉంటుంది. ఇదిగో ఈ వీడియోలో చూపించినట్లుగా ఉంటుంది. సింపుల్‌గా చెప్పాలంటే…

Click Here To Watch Now

ఓ షూటింగ్‌ కోసం ముంబయి వెళ్లిన సమంత కనిపించడంతో ఫొటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లు తమ కెమెరాలకు పని చెప్పారు. ఇలా సమంత రూమ్‌ నుండి బయటకు వచ్చిందో లేదో… కెమెరామన్‌ చుట్టుముట్టేశారు. దీంతో అక్కడే ఉన్న హీరో వరుణ్‌ ధావన్‌… ఆమెకు సపోర్టుగా నిలిచాడు. ‘ఎందుకయ్యా భయపెడతారు.. ఆమెను భయపెట్టొద్దు’ అంటూ కెమెరామెన్‌కు చెప్పాడు. ఆ తర్వాత ఆమెను జాగ్రత్తగా బయటకు తీసుకొచ్చి కారు ఎక్కించి పంపించేశాడు. ఇప్పుడు మొత్తం వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిది.

సమంత కోసం వరుణ్‌ ధావన్‌ చేసిన పనిని చూసి… నెటిజన్లు రెండు రకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది వరుణ్‌ ధావన్‌ చేసిన పనిని సపోర్టు చేస్తుంటే, మరికొంతమంది అంత సీన్‌ అవసరమా అంటున్నారు. ఎందుకంటే సమంతకు ఫొటోలు, వీడియోలు, ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు కొత్తేం కాదు. టాలీవుడ్‌లో ఇలాంటివి చాలానే చూసింది. మరి అలాంటప్పుడు అంత సీనెందుకు అనేది ఇక్కడి వాళ్ల ప్రశ్న. అయితే బాలీవుడ్‌ పీపుల్‌, వరుణ్‌ ధావన్‌ ఫ్యాన్స్‌ అయితే… ‘అన్నా నువ్వు సూపర్‌’ అంటూ ఆకాశానికెత్తేస్తున్నారు.

ఇక అసలు సమంత ముంబయి ఎందుకు వెళ్లింది, వరుణ్‌ ధావన్‌ను కలిసింది అనేది ఆరా తీస్తే… ఇద్దరూ కలసి రాజ్‌ అండ్‌ డీకే, రూసో బ్రదర్స్‌ రూపొందిస్తున్న ‘సిటాడెల్‌’ అనే సిరీస్‌లో చేస్తోంది. అయితే ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్‌ కి సంబంధించి అఫీషియల్‌ సమాచారం అయితే లేదు. మరోవైపు సమంత ‘అరేంజ్‌మెంట్స్‌ ఆఫ్‌ లవ్‌’ అనే హాలీవుడ్‌ సినిమాలో కూడా నటిస్తోంది. తెలుగులో ‘శాకుంతలం’, తమిళ– తెలుగులో ‘కాథువాకుల రెండు కాకుల్‌’ (తెలుగులో కణ్మణి రాంబో ఖతీజా) విడుదలకు సిద్ధమవుతున్నాయి. ‘యశోధ’ సినిమా షూటింగ్‌ జరుగుతోంది.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus