`హ్యాపీడేస్`, `కొత్త బంగారు లోకం` చిత్రాలతో ఒక్కసారిగా స్టార్ అయిపోయాడు వరుణ్ సందేశ్. టాలీవుడ్ ఎవరీ కొత్త కుర్రాడని తిరిగి చూసే లోపే క్రేజీ యంగస్టర్‌గా ఎదిగిపోయాడు. హీరోగా ఎంట్రీతోనే బ్యాక్ టూ బ్యాక్ రెండు బ్లాక్‌బస్టర్స్ పడటంతో వరుణ్ సందేశ్ రేంజ్ మారిపోయింది. అయితే ఆ సక్సెస్ ల తరువాత కూడా వరుణ్ కి `ఏమైంది ఈ వేళా`లాంటి మంచి హిట్ కొట్టాడు.
ఆ తరువాత `చమ్మక్ చల్లో`, `సరదాగా అమ్మాయితో`, `ఢీ ఫర్ దోపిడి`, `ఈ వర్షం సాక్షిగా`, `మామ మంచు అల్లుడు కంచు`, `లవకుశ` వంటి చిత్రాల్లో నటించి మెప్పించాడు. అయితే ఈ మద్య వరుణ్ సందేశ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. మళ్ళీ చాల రోజులు తరువాత ఒక సినిమా చేస్తున్నాడు. కాగా తన రీఎంట్రీ అదిరిపోయేలా ఉంటుందని చెబుతున్నాడు వరుణ్. ఈ మేరకు ఆయన ఓ స్పెషల్ వీడియోని రూపొందించారు. కమెడీయన్ ధన్‌రాజ్ తో చేసిన ఈ వీడియోలో తన సినిమా గురించి చెప్పుకొచ్చాడు వరుణ్. నెక్ట్స్ తాను `ఇందువదన` సినిమా చేయబోతున్నాడట. చిత్ర ఫస్ట్ లుక్ అదిరిపోతుందని, ఊహించని విధంగా ఉంటుందని, దీనమ్మ వరుణ్ సందేశ్ ఏంట్రా ఇలా ఉన్నాడనుకోవాలని, ఆ రేంజ్‌లో ఉంటుందని చెప్పారు. మరో రెండు రోజుల్లో ఫస్ట్ లుక్ వస్తుందన్నారు.
ఇక ఈ చిత్రానికి యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ఎంఎస్‌ఆర్ దర్శకత్వం వహిస్తుండగా, శ్రీ బాలాజీ పిక్చర్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతుంది. మొత్తానికి మెగాస్టార్ ఫేమస్ సాంగ్ లోని పదాన్ని తన సినిమాకి టైటిల్ గా పెట్టుకున్న వరుణ్ నుండి మరో ఇంట్రస్టింగ్ సినిమా రాబోతుంది అన్నమాట.