Varun Tej: ‘గని’ ఫ్లాప్‌పై స్పందించిన వరుణ్‌తేజ్‌.. ఏం చెప్పాడంటే?

ఏదైనా ఫ్లాప్‌ సినిమానో, డిజాస్టర్‌ సినిమానో చూసొచ్చాక సగటు సినిమా ప్రేక్షకుడికి ఓ డౌట్‌ వస్తుంది. ‘ఇంత చెత్త సినిమా తీస్తున్నప్పుడో, తీస్తున్నాకో ఆ టీమ్‌కి డౌట్‌ రాలేదా?’ అని. నిజానికి ఈ డౌట్‌ చాలామందికి వస్తుంది. అయితే ఎక్కడో చిన్న ఆశతో సినిమాను పూర్తి చేస్తారు, రిలీజ్‌ చేస్తారు, ఫలితం కోసం ఎదురుచూసి తేడాకొడితే నిరాశపడతారు. ఇప్పుడు ఈ ‘ఫ్లాప్‌’ సంగతులు ఎందుకు అనుకుంటున్నారా? ఉందీ కారణం ఉంది. ఎందుకంటే ఇలాంటి మాటలే చెప్పాడు వరుణ్‌ తేజ్‌.

కెరీర్‌ తొలి నాళ్లలో కాస్త ఇబ్బంది పడ్డా వరుసగా మంచి విజయాలు అందుకున్నాడు వరుణ్‌ తేజ్‌. ప్రేమకథల హీరోగా ఉండిపోతాడేమో అనుకుంటున్నప్పుడు ‘గని’ అంటూ ఓ కమర్షియల్‌ పేరుతో సినిమా అనౌన్స్‌ చేశాడు. బాక్సింగ్‌ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని చెప్పి ఆశ్చర్యపరిచారు. అనుకున్నట్లుగానే సినిమాకు మంచి బజ్‌ వచ్చింది. అయితే అనుకోని పరిస్థితుల్లో సినిమా విడుదల వాయిదాలు పడింది. కానీ ఎంతో నమ్మకంగా సినిమాను విడుదల చేశారు. కానీ ఫలితం తేడా కొట్టింది.

ఈ నేపథ్యంలో ఆ సినిమా ఫలితం గురించి (Varun Tej) వరుణ్‌ తేజ్‌ ఇటీవల స్పందించాడు. ‘గాండీవధారి అర్జున’ సినిమా విడుదల (ఆగస్టు 25) సందర్భంగా వరుణ్‌తేజ్‌ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ క్రమంలోనే ‘గని’ ఫలితం గురించి మాట్లాడాడు. ఎంతో నమ్మకంతో ఆ సినిమా కోసం వరుణ్‌ బాడీ ట్రాన్సాఫార్మేషన్‌ కూడా చేసుకున్నాడు. సినిమా తగ్గట్టుగా హల్క్‌లా తయారయ్యాడు కూడా. ‘గ‌ని’ నా తొలి ఫ్లాప్ కాదు. అంత‌కుముందు కూడా కొన్ని ప‌రాజ‌యాలు వచ్చాయి. స‌క్సెస్ కంటే ఫెయిల్యూరే మ‌న‌కు ఎక్కువ నేర్పిస్తుంది అని నమ్ముతాను అంటూ నమ్మకంగా మాట్లాడాడు.

‘మిస్ట‌ర్’ సినిమా ఫ్లాప్ అయ్యాక త‌ప్పెక్క‌డ జ‌రిగిందో విశ్లేషించుకున్నాను. ఆ తప్పును ఫిక్స్ చేసుకుని తర్వాత సినిమాలు చేశాను. ‘ఫిదా’, ‘తొలిప్రేమ’ లాంటి మంచి సినిమాలు చేశాను. అయితే ‘గ‌ని’ సినిమా విషయంలో తేడా జరిగింది. అయితే త‌ప్పు ఎక్క‌డ జ‌రిగిందో మాకు తెలుసు అని చెప్పాడు వరుణ్‌. స్పోర్ట్స్ డ్రామాగా మొదలైన ఆ సినిమా ఆలోచనను.. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కూ చేరువ అయ్యేలా ఆలోచన మార్పులు చేసేసింది. అక్క‌డే తేడా కొట్టేసింది. సినిమా ఫ‌స్ట్ కాపీ చూసుకున్న‌పుడే ఆ సినిమా ఆడ‌ద‌ని అనిపించింది. కానీ ఏదైనా అద్భుతం జ‌రుగుతుందేమో అనే ఆశతో సినిమా విడుదల వరకు ఆగాం. కానీ అలా జరగలేదు అని చెప్పాడు వరుణ్‌.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus