Varun Tej: పెళ్లి కాలేదు.. కానీ ఫ్రస్ట్రేషన్ తో యాక్ట్ చేశా: వరుణ్ తేజ్

పెళ్లాలు వారితో వచ్చే ఫ్రస్ట్రేషన్ ను ‘ఎఫ్2’ సినిమాలో చూపించారు. దానికి సీక్వెల్ గా వస్తోన్న ‘ఎఫ్3’ సినిమాలో మనీ కాన్సెప్ట్ ను ఎన్నుకున్నప్పటికీ.. భార్యల ద్వారా వచ్చే ఫ్రస్ట్రేషన్ ను కూడా ఇందులో చూపిస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్ లీడ్ రోల్స్ చేశారు. పెళ్లైన వెంకీ తన పాత్రలో బాగానే చేశారు. మరి పెళ్లి కాని వరుణ్ తేజ్ ఎలా చేయగలిగాడనే ప్రశ్నలు ఎదురయ్యాయి. దీనికి సమాధానమిచ్చారు వరుణ్ తేజ్.

‘తనకు ఇంకా పెళ్లి కాలేదు కానీ.. ‘ఎఫ్2’, ‘ఎఫ్3’లో చాలా బాగా ఫ్రస్ట్రేషన్ చూపించనాని అంటున్నారని అన్నారు. వెంకటేష్ గారికి పెళ్లయింది కాబట్టి ఆయన ఇబ్బంది పడలేదని.. ఇక తన విషయానికొస్తే.. పక్కన ఉన్నవాళ్లను చూసి ఫ్రస్ట్రేషన్ నేర్చుకున్నానని తెలిపారు. దిల్ రాజు, అనిల్ రావిపూడి, అలీ.. వాళ్ల ఇంట్లో ఎలా ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతారో తనకు తెలుసని.. వాళ్లను చూసి తను కూడా నేర్చుకున్నట్లు చెప్పారు. సినిమాలో అదే చేసి చూపించానని అన్నారు.

అలా వాళ్లను చూసి ఫ్రస్ట్రేషన్ తో ఎలా నటించాలో నేర్చుకున్నట్లు సరదాగా చెప్పుకొచ్చారు వరుణ్ తేజ్. ‘ఎఫ్2’ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ‘ఎఫ్3’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్లే ప్రమోషన్స్ మొదలుపెట్టారు. టీమ్ మొత్తం కలిసి సినిమాను గట్టిగా ప్రమోట్చేస్తుంది . ఇటీవల ప్రీరిలీజ్ ఈవెంట్ లో కూడా రచ్చ రచ్చ చేశారు. అలానే ఆడియన్స్ తో ఇంటరాక్ట్ అయ్యారు.

‘ఎఫ్3’ సినిమాలో మనీ ప్లాంట్ తో వంటకాలు చేసినట్లు ట్రైలర్ లో చూపించారు. దానికి వెంకీ బాగా ఫ్రస్ట్రేట్ అవుతారు. ప్రమోషన్స్ లో నిజంగానే ఓ మహిళ.. మనీ ప్లాంట్ తో వంటకాన్ని తీసుకొచ్చి వెంకీకి అందించింది. వెంకీ భయపడుతూనే ఆ వంటకాన్ని తిని.. బావుందని సదరు మహిళను మెచ్చుకున్నారు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus