అనన్య పాండే కంటే ముందు వరుణ్ హీరోయిన్ ను అనుకున్నారట కానీ..!

  • March 4, 2020 / 10:52 PM IST

విజయ్ దేవరకొండ వరుసగా రెండు డిజాస్టర్లతో ఇప్పుడు రేసులో వెనుకపడిపోయాడు. ఆయన నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రం కనీసం 10 కోట్ల షేర్ ను కూడా వసూల్ చేయలేదు. కాబట్టి విజయ్ ఇప్పుడు కచ్చితంగా ఓ హిట్టు కొట్టాలి. అందుకే ‘ఇస్మార్ట్ శంకర్’ తో బ్లాక్ బస్టర్ కొట్టి బౌన్స్ బ్యాక్ అయిన పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ఓ చిత్రం చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రానికి మొదట ‘ఫైటర్’ అనే టైటిల్ అనుకున్నారు.. కానీ ఇప్పుడు దానిని ‘లైగర్’ గా మార్చే అవకాశాలు ఉన్నాయట.

ఇక ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్లో రూపొందించాలని పూరి మరియు కరణ్ జోహార్ లు చేతులు కలిపారు. అందుకే ఈ చిత్రంలో బాలీవుడ్ క్రేజీ బ్యూటీ అనన్య పాండే ను హీరోయిన్ గా తీసుకున్నారు. ఇక ఈ భామ గ్లామర్ పిక్స్ తో చిత్ర యూనిట్ ప్రమోషన్లు కూడా మొదలు పెట్టేసింది. అయితే నిజానికి మొదట వేరే హీరోయిన్ ను అనుకున్నారట. ఆమె ఎవరో కాదు దిశా పటాని. ఈమె సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది తెలుగు సినిమాతోనే. వరుణ్ తేజ్-పూరి కాంబినేషన్లో వచ్చిన ‘లోఫర్’ చిత్రంతో ఈమె ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ చిత్రం ప్లాప్ అవ్వడంతో మళ్ళీ బాలీవుడ్ కు చెక్కేసింది ఈ బ్యూటీ. ఇక విజయ్ దేవరకొండ సినిమా కోసం పూరి మరోసారి ట్రై చెయ్యగా… వరుస సినిమాలతో బిజీగా ఉండడం వల్ల నో చెప్పిందట. దాంతో అనన్య పాండే ను తీసుకున్నాడు పూరి.

Most Recommended Video

‘హిట్ ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus