Varun, Lavanya: ప్రిన్సెస్ తో మెగా ప్రిన్స్.. ఘనంగా వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి ల ఎంగేజ్మెంట్!

టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్…ల ఎంగేజ్మెంట్ ఈరోజు హైదరాబాద్, మనికొండలో ఉన్న నాగబాబు ఇంట్లో ఘనంగా జరిగింది. కొద్దిపాటి బంధుమిత్రుల.. సమక్షంలో ఘనంగా జరిగింది. గత 4,5 రోజులుగా సోషల్ మీడియాలో ఈ టాపిక్ పై అనేక వార్తలు వైరల్ అవుతూ వచ్చిన సంగతి తెలిసిందే. మొదట్లో వీళ్ళు డేటింగ్ లో ఉన్నట్టు ఎన్నో వార్తలు వచ్చేవి. కానీ అవి అవాస్తవాలని వీళ్ళు తేల్చి చెప్పేశారు.

కానీ ఆ ప్రచారం ఆగలేదు.కొన్నాళ్ల తర్వాత వీటికి స్పందించడం కూడా మానేశారు. అయితే ఫైనల్ గా వీళ్ళు పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయారు.జూన్ 9న లావణ్య త్రిపాఠి – వరుణ్ తేజ్ ల ఎంగేజ్మెంట్ జరగబోతుంది అని అఫిషియల్ గా ప్రకటించడంతో మెగా ఫ్యామిలీ ఇంట పెళ్లి సంబరాలు మొదలైనట్టు అయ్యాయి.

ఇక (Varun) వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ల ఎంగేజ్మెంట్ కి నాగబాబు తల్లి అంజనా దేవి, చిరంజీవి, పవన్ కళ్యాణ్, రాంచరణ్, అల్లు అర్జున్, అల్లు బాబీ, అల్లు శిరీష్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ , సుస్మిత కొణిదెల , శ్రీజ కొణిదెల, డాక్టర్ వెంకటేశ్వర రావు వంటి వారు హాజరయ్యారు. అయితే పెళ్లి డేట్ ఇంకా ఫిక్స్ చేయలేదు. మై లవ్ అంటూ వరుణ్ తేజ్ ఈ ఈవెంట్ కు సంబంధించిన ఫోటోలు షేర్ చేశాడు.ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి:

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus