Varun, Lavanya: వరుణ్ తేజ్ లావణ్య త్రిపాటి నిశ్చితార్థం రేపే.. క్లారిటీ ఇచ్చిన వరుణ్ తేజ్ టీమ్!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటి లావణ్య త్రిపాటి పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఇలా వీరిద్దరి ప్రేమ,నిశ్చితార్థం గురించి వార్తలు వస్తున్నప్పటికీ ఈ విషయం గురించి మెగా ఫ్యామిలీ ఏ విధమైనటువంటి ప్రకటన ఇవ్వకపోవడంతో అందరిలోనూ కొంత పాటి సందేహాలు ఉన్నాయి. జూన్ 9వ తేదీ వీరిద్దరి నిశ్చితార్థం జరగబోతుంది అంటూ ఓ వార్త వైరల్ గా మారింది.

ఇలా వీరి నిశ్చితార్థం గురించి వార్తలు రావడమే కాకుండా జూన్ 9వ తేదీ దగ్గర పడినప్పటికీ మెగా కాంపౌండ్ నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఇది నిజమా కాదా అన్న సందేహం అందరిలోనూ ఉంది అయితే తాజాగా ఈ విషయం గురించి వరుణ్ తేజ్ టీమ్ స్పందిస్తూ అధికారక ప్రకటన చేశారు.ఇన్ని రోజులు వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి గురించి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు నిజమేనంటూ ప్రకటించారు.

ఈ సందర్భంగా వరుణ్ తేజ్ (Varun) లావణ్య త్రిపాఠి జూన్ 9వ తేదీ నిశ్చితార్థం జరుపుకోబోతున్నారని తెలియచేయడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలోనే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాటికి ముందుగానే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే ఈ నిశ్చితార్థ వేడుకకు కేవలం మెగా కుటుంబ సభ్యులు మాత్రమే హాజరు కాబోతున్నట్టు సమాచారం. కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి నిశ్చితార్థం జరగబోతుందని పెళ్లి మాత్రం ఇండస్ట్రీకి రాజకీయ రంగానికి చెందిన వారందరిని ఆహ్వానించబోతున్నారని తెలుస్తుంది.

ఇక వీరిద్దరూ శీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ అనే సినిమా ద్వారా జంటగా నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని సమాచారం అనంతరం వీరి కాంబినేషన్ లో అంతరిక్షం అనే సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఏది ఏమైనా లావణ్య త్రిపాఠి మెగా ఇంటికి కోడలుగా అడుగుపెట్టబోతుందన్న వార్త అందరిని సంతోషానికి గురి చేసింది.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus