Varun, Lavanya: వేకేషన్ కాదు..ఫంక్షనే అంటున్న మెగా ఫ్యామిలీ!

మెగా బ్రదర్ నాగబాబు ప్రస్తుతం ఒకపక్క సినిమాల్లో నటిస్తూనే ఇంకోపక్క జనసేన నాయకుడిగా రాజకీయ ప్రచారాల్లో పాల్గొంటున్నాడు. మొదటి నుంచి కూడా నాగబాబుకి స్వతంత్ర భావాలు చాలా ఎక్కువ. ఆయన మనసుకు ఏది అనిపిస్తే అదే చెప్తూ ఉంటాడు. అయితే నాగబాబు పిల్లల విషయంలో ఈమధ్య చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి. నాగబాబుకి వరుణ్ తేజ్, నిహారిక ఇద్దరు పిల్లలు ఉన్న విషయం తెలిసిందే. ఇక నిహారిక ఈ మధ్యనే విడాకులు తీసుకోగా..

వరుణ్ తేజ్ పెళ్లికి రెడీ అవుతున్నాడు. జూన్ లో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి తో ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. త్వరలోనే వారి డెస్టినేషన్ వెడ్డింగ్ ఉండనుందని వార్తలు వచ్చాయి. అయితే ఆగస్టులోనే వీరి పెళ్లి జరగాల్సి ఉండగా.. కొన్ని కారణాలవల్ల ఆగస్టు నుంచి నవంబర్ వాయిదా పడిందని వార్తలు వచ్చాయి. ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటామని వరుణ్ తేజ్ అధికారికంగానే చెప్పాడు.

ఇక గత నెల గాండీవధారి అర్జున అనే సినిమాతో వరుణ్ (Varun) ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. దీంతో కొంత గ్యాప్ తీసుకున్న వరుణ్ కుటుంబంతో కలిసి వెకేషన్ కు వెళ్ళాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నిహారిక సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది.నాగబాబు ఆయన భార్య పద్మజ, వరుణ్, నిహారిక కుటుంబమంతా కలిసి ఎయిర్ పోర్టులో సెల్ఫీ తీసుకున్న ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.

అయితే అందుతున్న సమాచారం ప్రకారం వీళ్ళు మెగా ట్రిప్ వేసింది కేవలం వెకేషన్ కోసమే కాదని వరుణ్, లావణ్య పెళ్లి పనులు కూడా చూడచ్చని, అందుకనే కుటుంబం మొత్తం విదేశాలకు వెళ్లినట్లు సమాచారం అందుతుంది. ఇంకొపక్క లావణ్య సైతం మరో ఫ్లైట్లో వారు ఉన్నచోటకే వెళ్లిందని తెలుస్తుంది. అక్కడ వెడ్డింగ్ కు సంబంధించిన వేదిక, తదితర అంశాలకు సంబంధించిన పనులు చేయడానికి మెగా కుటుంబం వెళ్లిందని అంటున్నారు.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus