కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ కరోనా కట్టడి చర్యల్లో భాగంగా మే నెల 1వ తేదీ నుంచి 18 సంవత్సరాల వయస్సు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ పంపిణీ జరిగేలా చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రజల్లో మాత్రం కరోనా వ్యాక్సిన్ ను సంబంధించి అనేక అపోహలు నెలకొన్నాయి. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తరువాత తాత్కాలికంగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉండటంతో కొంతమంది కరోనా వ్యాక్సిన్ పేరు వింటే భయపడుతున్నారు.
అయితే మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ సోషల్ మీడియా ద్వారా కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించే ప్రయత్నం చేశారు. ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ ను తప్పనిసరిగా వేయించుకోవాలని సూచనలు చేశారు. వ్యాక్సిన్ గురించి ఎక్కువగా ఆలోచించవద్దని వ్యాక్సిన్ వేయించుకోవాలని వరుణ్ తేజ్ అన్నారు. http://cowin.gov.in ద్వారా కరోనా వ్యాక్సిన్ కోసం రిజిష్టర్ చేసుకోవాలని వరుణ్ తేజ్ సూచనలు చేశారు. కరోనా వ్యాక్సిన్ గురించి వరుణ్ తేజ్ చేసిన పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
గద్దలకొండ గణేష్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన వరుణ్ తేజ్ ప్రస్తుతం గని, ఎఫ్3 సినిమాలలో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. కరోనా సెకండ్ వేవ్ వల్ల ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్లు మారే అవకాశం ఉండగా కరోనా విజృంభణ తగ్గితే మాత్రం ఈ ఏడాదే ఈ రెండు సినిమాలు రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయి. వరుస విజయాలతో జోరుమీదున్న వరుణ్ ఈ సినిమాలతో సక్సెస్ సాధిస్తానని భావిస్తున్నారు.