Varun Tej: ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్..!

ఇటీవల విడుదలైన వరుణ్ తేజ్ ‘గని’ మూవీ ప్రేక్షకులని చాలా డిజప్పాయింట్ చేసింది. ఓపెనింగ్స్ కూడా చాలా పూర్ గా నమోదయ్యాయి. ఇక ఈ చిత్రం రిజల్ట్ పై వరుణ్ తేజ్ స్పందిస్తూ ఓ లేఖ రాశారు.ఈ లేఖ ద్వారా వరుణ్ తేజ్ స్పందిస్తూ.. “నాపై మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ఎల్లప్పుడూ కృత‌జ్ఞుడనై ఉంటాను. ‘గ‌ని’ సినిమా కోసం పనిచేసిన ప్రతీ ఒక్క‌రికీ పేరు పేరునా ధ‌న్య‌వాదాలు తెలుపుకుంటున్నాను. మీరు ఈ సినిమా కోసం అహ‌ర్నిశ‌లు క‌ష్ట‌ప‌డ్డారని నాకు తెలుసు.

మ‌న‌సు పెట్టి ప‌ని చేశారు. ఓ మంచి సినిమాను ప్రేక్షకులకి అందించాల‌నే త‌ప‌న‌తో ఈ సినిమా కోసం పనిచేసారు. అయితే మేం చెప్పాల‌నుకున్న విషయాన్ని స‌రిగ్గా చెప్ప‌లేక‌పోయాం. ప్రేక్షకుల్ని ఎంట‌ర్‌టైన్ చేయాల‌నే ఉద్దేశంతోనే ప్ర‌తి సినిమాకు మ‌న‌సు పెట్టి ప‌ని చేస్తాను. కొన్నిసార్లు స‌క్సెస్ అయ్యాను. కొన్నిసార్లు కొత్త విష‌యాల‌ను నేర్చుకున్నాను. కానీ క‌ష్ట‌ప‌డ‌టం ఎప్ప‌టికీ ఆప‌ను’’ అంటూ వరుణ్ తేజ్ పేర్కొన్నాడు.’గని’ షూటింగ్ 4 ఏళ్ళ పాటు జరిగింది.

కరోనా కారణంగా చాలా సార్లు వాయిదా పడింది. ఈ మూవీ కోసం వ‌రుణ్ తేజ్.. సిక్స్ ప్యాక్ చేయడంతో పాటు అమెరికాకు వెళ్లి బాక్సింగ్‌లో ప్ర‌త్యేక శిక్ష‌ణ‌ తీసుకున్నాడు. ప‌క్కా ప్రొఫెష‌న‌ల్ స్పోర్ట్స్ మెన్ లా ట్రైనింగ్ తీసుకుని మ‌రీ ‘గ‌ని’ సినిమా షూటింగ్లో జాయిన్ అయ్యాడు. తమన్ సంగీతం అందించిన పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. కిర‌ణ్ కొర్రపాటి ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ చిత్రానికి అల్లు అరవింద్ తనయుడు అల్లు బాబి, అలాగే బన్నీ ఫ్యామిలీకి బంధువు అయిన సిద్ధు ముద్ద ఈ చిత్రాన్ని నిర్మించారు.

బాలీవుడ్ నుండీ స‌యీ మంజ్రేక‌ర్ ను, సునీల్ శెట్టిని… కన్నడ నుండి ఉపేంద్రని ఈ మూవీ కోసం తీసుకొచ్చారు. వరుణ్ తేజ్ కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందుతుంది.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus