మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) ‘మట్కా’ (Matka) తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నవంబర్ 8న ఈ సినిమా విడుదల కాబోతుంది. కరుణ కుమార్ (Karuna Kumar) డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ బయటకు వచ్చింది. దానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇది పక్కన పెట్టేస్తే.. వరుణ్ తేజ్ ఈ మధ్య ఫామ్లో లేడు. అతని గత చిత్రాలు ‘గని’ (Ghani) ‘గాండీవధారి అర్జున’ (Gandeevadhari Arjuna) ‘ఆపరేషన్ వాలెంటైన్’ (Operation Valentine) వంటివి డిజాస్టర్స్ గా మిగిలిపోయాయి. ‘మట్కా’ ఫలితం ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.
అయితే వరుణ్ తేజ్.. కంటెంట్ పై నమ్మకంతో వరుసగా ప్లాప్ డైరెక్టర్స్ కి ఛాన్సులు ఇచ్చుకుంటూ పోతున్నాడు. ‘గని’ ‘గాండీవధారి అర్జున’ ‘ఆపరేషన్ వాలెంటైన్’ వంటి చిత్రాలు కనీసం బాక్సాఫీస్ వద్ద రూ.5 కోట్ల షేర్ ను కూడా రాబట్టలేకపోయాయి. వరుణ్ తేజ్ ఒక్కో సినిమాకు రూ.8 కోట్లు పారితోషికం అందుకుంటాడు. అంటే కనీసం అతని పారితోషికం రేంజ్లో కూడా కలెక్షన్స్ రావడం లేదు అని స్పష్టమవుతుంది. ఇందుకు ప్రధాన కారణం వరుణ్ తేజ్..
ప్లాప్ డైరెక్టర్స్ తో సినిమాలు చేయడం వల్ల వాటికి సరైన హైప్ క్రియేట్ అవ్వడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా వరుణ్ తేజ్ ఇంకో ప్లాప్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చాడని తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే..2018 లో రవితేజ హీరోగా వచ్చిన ‘టచ్ చేసి చూడు’ (Touch Chesi Chudu) తో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు విక్రమ్ సిరికొండ (Vikram Sirikonda) . దాని తర్వాత విక్రమ్ కి ఛాన్సులు రాలేదు. మొత్తానికి ఇప్పుడు వరుణ్ తేజ్ (Ravi Teja) ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది. విక్రమ్ మంచి రైటర్.
‘రేసుగుర్రం’ (Race Gurram) ‘మిరపకాయ్’ (Mirapakay) వంటి హిట్ సినిమాలకి పనిచేశాడు. కానీ ఎందుకో మొదటి సినిమా ఆడలేదు. వరుణ్ తేజ్ తో చేసే సినిమాతో అయినా మంచి హిట్టు కొడతాడేమో చూడాలి. ఇక వరుణ్ – విక్రమ్ సిరికొండ..ల చిత్రాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ నిర్మించబోతున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్టు పై అధికారిక ప్రకటన రానుంది.