Vasanthi, Faima: కెప్టెన్సీ టాస్క్ లో సుదీప చేసిన ఆ పని కి హర్ట్ అయిన ఫైమా..! అసలేం జరిగిందంటే.?

బిగ్ బాస్ హౌస్ లో ఆరోవారం కెప్టెన్ గా ఆర్జే సూర్య గెలిచాడు. ఆఖరి వరకూ ఆపకు పరుగు అనే టాస్క్ లో చివరి వరకూ రేస్ లో నిలిచిన సూర్య రోహిత్ తో పోటీపడి హౌస్ మేట్స్ మెజారిటీ ఓటింగ్ ని సంపాదించాడు. ఇక్కడ మెరీనా సైతం మొగుడిని కాదని సూర్యకి ఓటు వేయడం గమనార్హం. ఎందుకంటే, అప్పటికే సూర్య విన్ డిక్లేర్ అయిపోయింది. అఫీషియల్ గా వేయాలి కాబట్టి ఓటు వేసింది మెరీనా. అంతకుముందు కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ కోసం గార్డెన్ లో బాస్కెట్ లో బంతిని ఉంచే గేమ్ లో హౌస్ మేట్స్ పోటీపడ్డారు.

ఇక్కడే సుదీప చేసిన పని ఫైమా, కీర్తిలకి నచ్చలేదు. బాల్ కోసం మెరీనా, రోహిత్, బాలాదిత్య, ఫైమా , కీర్తి బాగా ఫైట్ చేసుకున్నారు. ఒకరి మీద ఒకరు పడిపోయి మరీ బాల్ ని చేజిక్కుంచుకోవాలని చూశారు. ఇక్కడే సుదీప బాల్ ని లాక్కుని రోహిత్ బాస్కెట్ లో వేసింది. దీనిపైన కీర్తి, ఫైమా ఇద్దరూ కూడా అసహనాన్ని తెలియజేశారు. ఫైమా అయితే బాగా ఫ్రస్టేట్ అయ్యింది. వాళ్లకోసం చాలామంది హెల్ప్ చేశారని, అదే మన గ్రూప్ వాళ్లు అయితే పిలిచినా కూడా రారు అంటూ దెప్పిపొడిచింది.

ఫైమా మాటలకి సూర్య కూడా హర్ట్ అయ్యాడు. రోహిత్ చేసి శాక్రిఫైజ్ ని కూడా ఫైమా తీసిపారేసింది. అది వాళ్ల గేమ్ అని, గేమ్ లో పార్ట్ గా పనిష్మెంట్ లాగా తీస్కున్నారని చెప్పింది. గేమ్ ఆడి శాక్రిఫైజ్ అనే సింపతీని వాడద్దన్నట్లుగా చెప్పింది. ఫైమా బెస్ట్ ఫ్రెండ్ అయిన ఇనయ ఫైమా మాటలకి బ్రేక్ వేసింది. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్లు కరెక్ట్ గా ఉంటారని చెప్పింది. నాకు నువ్వు చేసింది కూడా నచ్చలేదని ముఖంపైనే చెప్పేసింది. కెప్టెన్సీ టాస్క్ మొదలు పెట్టిన తర్వాత వాసంతీకి ఇంకా ఆదిరెడ్డికి గట్టి వాదనే పడింది.

ఆదిరెడ్డి తనను తాను డిపెండ్ చేస్కుంటూ మాట్లాడాడు. హౌస్ లో అవకాశాలు రావట్లేదు, ఎక్కువ ప్రూవ్ చేస్కోలేకపోతున్నామ్ అనేవాళ్లకి పుష్ ఇవ్వడానికి రాలేదు, ఎఫోర్ట్స్ పెట్టిన వారికి లక్ ఫేవర్ చేస్తది కానీ, తక్కువ ఎఫోర్ట్స్ పెట్టిన వాళ్లకి పాపం వాడు ఇంతవరకూ ఏం అవ్వలేదురా అనేవారికి లక్ ఫేవర్ చేయదు అంటూ మాట్లాడాడు. దీనికి వాసంతీ స్ట్రాంగ్ గా మాట్లాడింది. ఇక్కడ గేమ్ ఆడితేనే కాదు, హౌస్ లో ఉండటం కూడా గేమే అన్నట్లుగా చెప్పింది.

అంతేకాదు, అయ్యోపాపం అని జాలితో ఎవరూ లేరని, అనవసరంగా సింపతీ కోరుకోవట్లేదని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఇక హౌస్ మేట్స్ ఓటింగ్ జరిగేటపుడు రాజ్ ఇంకా గీతు చెప్పిన రీజన్ కి ఫుల్ గా హర్ట్ అయ్యింది. రాజ్ ఆటలో ఇంక నువ్వు ముందుకెళ్లలేవని అనిపిస్తోందని, రేస్ లో నువ్వు పరిగెత్తలేవని ఓటు వేయట్లేదని చెప్పాడు. దీంతో వాసంతీకి పిచ్చకోపం వచ్చేసింది. అలాగే, గీతు నామినేషన్స్ అంటే నీకు భయం అనే రీజన్ చెప్పింది. నామినేషన్స్ అంటే భయపడేదాన్ని అయితే నేను సుదీపని సేఫ్ చేసి నామినేట్ అయ్యేదాన్ని కాదు అని కౌంటర్ వేసింది.

ఇక రాజ్ చెప్పిన రీజన్ కి చాలాసేపు ఇరిటేట్ అయిపోయింది వాసంతీ. నామినేషన్స్ అప్పుడు స్ట్రాంగ్ గా మాట్లాడతా అంటూ రెచ్చిపోయింది. కెప్టెన్సీ రేస్ టాస్క్ లో శ్రీసత్య, రేవంత్, అర్జున్, ఆదిరెడ్డి అవుట్ అయిపోయిన తర్వాత చివరివరకూ రోహిత్ ఇంకా ఆర్జే సూర్యలు ఉన్నారు. ఆర్జే సూర్యకి ఆల్ మోస్ట్ హౌస్ అంతా సపోర్ట్ చేసి కెప్టెన్ ని చేసింది. దీంతో హౌస్ లో ఆరో కెప్టెన్ గా సూర్య ఎంపిక అయ్యాడు. ఈవారం నామినేషన్స్ లో లేడు కాబట్టి, నెక్ట్స్ వీక్ కూడా ఇమ్యూనిటీ లభించింది.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus