‘విశ్వంభర’ సినిమా మీద ఉన్న అంచనాలు ఈ మధ్య కాలంలో ఏ తెలుగు స్టార్ హీరో సినిమా మీద కూడా ఉండేవి కావు. సినిమా నేపథ్యం, కథాంశం, హీరో – డైరక్టర్ కాంబినేషన్ ఇలా చాలా అంశాలే దీనికి కారణం. అయితే ఒక్క టీజర్‌తో మొత్తం పరిస్థితి మారిపోయింది. సినిమా మీద ఉన్న బజ్ అంతా పోయి.. ఈ సినిమాను పట్టించుకోకపోవడం బెటర్ అని తేల్చేశారు. అయితే దీనికి కారణం కథాంశం కాదు.. విజువల్ ఎఫెక్ట్స్. దీంతో సినిమా టీమ్ ఆ తప్పులను సరిదిద్దుకోవడం మొదలుపెట్టింది.
అయితే ఇప్పటికీ సినిమా కథాంశం మీద ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంది. దానికి కారణం ఇది వివిధ లోకాల మధ్య నడిచే కథ. భీమవరం దొరబాబు అనే వ్యక్తి ఓ అవసరం మేరకు వేరే లోకానికి వెళ్లి విజయం సాధించే కాన్సెప్ట్. అయితే ఈ అంచనాలను మరింత పెంచేలా దర్శకుడు మల్లిడి విశిష్ఠ సినిమా కథ లైన్‌లో క్లుప్తంగా చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన దర్శకుడు ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళిలా మాట్లాడుతూ సినిమా లైన్ ఏంటో చెప్పేశారు.
మామూలుగా పెద్దలు చెప్పే ప్రకారం 14 లోకాలుఉన్నాయి. వాటికిపైన ‘విశ్వంభర’ అనే మరో లోకం ఉంటుంది. తన హీరోయిన్‌ను వెతుక్కుంటూ హీరో ఆ లోకంలో అడుగుపెడతాడు. హీరోయిన్ అక్కడకు ఎందుకు వెళ్లింది, ఎలా తిరిగి తీసుకొచ్చాడు అనేదే కథ. ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమాలో హీరోయిన్ స్వర్గం నుండి భూమికి వస్తుంది. ‘విశ్వంభర’లో హీరో భూమి నుండి విశ్వంభర అనే లోకానికి వెళ్తాడు అనేది ఇంకాస్త బ్రాడ్ కాన్సెప్ట్‌గా చెప్పొచ్చు.
ఇంకా చెప్పాలంటే సీతాదేవిని రావణుడు ఎత్తుకెళ్లిపోతే రాముడు ఎలా యుద్ధం చేశాడో, విశ్వంభర కూడా అలానే ఉంటుంది అని కూడా క్లారిటీ ఇచ్చారు వశిష్ట. ఇక ఈ సినిమాలో వశిష్ట ఓ ప్రత్యేక ఐదు లోకాలను సృష్టించారని సమాచారం. ఆ ఐదు పంచ భూతాన్ని గుర్తు చేస్తాయని టాక్. మరి కథ లైన్ చెప్పేసిన ఆయన.. తన స్క్రీన్ ప్లే మ్యాజిక్‌తో ఎలా రంజింపజేస్తారో చూడాలి.