ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్లో భాగంగాఏం జరిగింది అనే విషయానికి వస్తే రిషి మీరు నన్ను గతంలోనే చంపేశారు అంటూ సూటిపోటి మాటలతో వసుధారను బాధ పెడతాడు. అయితే తన తండ్రి వద్ద వసుధార ఎందుకు అర్థం చేసుకోలేదు అంటూ బాధపడుతూ ఉండగా చక్రపాణి వసుధారకు ధైర్యం చెబుతాడు మనసుకు మనిషికి మధ్య ఒక చిన్న పొర ఉంటుంది ఆపుర తొలగినప్పుడు తప్పకుండా రిసీ సార్ నేను అర్థం చేసుకుంటారు బాధపడకు అంటూ తనకు చెబుతాడు. మరోవైపు జగతి వసుధారకు మెసేజ్ చేస్తుంది నేను మహేంద్ర నిన్ను గురుదక్షిణ అడిగి చాలా ఇబ్బంది పెట్టాము ఇకపై నిన్ను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయము.
నేను నిన్ను ఒక కోరిక కోరుతాను కేవలం రిషి తల్లిదండ్రులుగా మాత్రమే ఈ కోరిక కోరుతున్నాము. రిషికి తిరిగి అందరిపై ప్రేమ కలిగేలా చెయ్యి తిరిగి తనని మామూలు మనిషిని చెయ్యి వసుధార ఇదే నేను నీ నుంచి కోరుకునేది అంటూ మెసేజ్ చేస్తుంది. మరోవైపు శైలేంద్ర రౌడీలకు ఫోన్ చేస్తార రౌడీల ఫోన్ రిషి లిఫ్ట్ చేయబోతూ ఉండగా స్విచ్ ఆఫ్ అవుతుంది అయితే రిషి ఆ ఫోన్ తీసుకొని ఎవరు చేసి ఉంటారు అని ఆలోచనలో పడతాడు మరోవైపు రౌడీలు ఫోన్ తీయకపోవడంతో ఏం జరుగుతుంది అంటూ శైలేంద్ర ప్రెస్టేషన్ అవుతారు. బయటకు వస్తుండగా ధరణి కాఫీ తీసుకొస్తుంది.
ధరణి వెళ్లి కాఫీ ఇవ్వడంతో శైలేంద్ర కాఫీ కప్పు విసిరి కొడతాడు దానికి ఇంట్లో వారంతా బయటకు వస్తారు. అసలేం జరిగింది శైలేంద్ర ఈమధ్య నువ్వు రోజు రోజుకి మరి విచిత్రంగా ప్రవర్తిస్తున్నావు. ఇది మంచి పద్ధతి కాదు అంటూ ఫణీంద్ర శైలేంద్రను తిడతారు. అప్పుడు ధరణి తన భర్తకు మద్దతుగా నిలబడి లేదు మామయ్య కాఫీ కప్పు నా చేయి జారి కింద పడిపోయింది అంటూ తన భర్తను వెనకేసుకొస్తుంది. అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోగా జగతి ఎందుకు అలా చెప్పావు అని ధరణిని అడుగుతుంది.ఆయనకి మామయ్య అంటేనే కాస్త భయం ఉంది అత్తయ్య ఇప్పుడు తనే అని చెప్పాననుకో ఆ ఉన్న కాస్త భయం కూడా పోతుంది అందుకే అలా చెప్పాను అని ధరణి చెబుతుంది.
మరో వైపు రిషి ఎస్ఐకి ఫోన్ చేసి తనని కలవాలని చెప్పడంతో మధ్యాహ్నం లంచ్ టైం లో వస్తానని చెబుతాడు. శైలేంద్ర మాత్రం ఏం జరిగింది అన్న కంగారులోనే ఉంటాడు.మధ్యాహ్నం కాలేజీకి ఎస్ఐ రావడంతో వసుధార సార్ ఏంటి ఏమైనా సమస్యనా ఇలా వచ్చారు అని అడుగుతుంది. రిషి సార్ రమ్మన్నారు అని ఎస్ఐ చెప్పగా రండి తన క్యాబిన్ కు తీసుకెళ్తుంది.రిషి రౌడీల ఫోన్ ఎస్ఐకి ఇవ్వగా అంతలోపే రిషికి ఇంపార్టెంట్ కాల్ రావడంతో బయటకు వెళ్తాడు.
శైలేంద్ర ఫోన్ చేయడంతో ఎస్ఐ ఫోన్ లిఫ్ట్ చేయగా శైలేంద్ర అసలేం జరిగిందిరా అక్కడ ఎందుకు మీరు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అంటూ మాట్లాడుతాడు. అయితే శైలేంద్ర మాటలను గుర్తుపడుతుంది వసుధర. ఎస్సై అంతలోపు హలో అనడంతో గొంతు మారిందన్న అనుమానం వచ్చినటువంటి శైలేంద్ర ఫోన్ కట్ చేస్తారు అంతలోపు రిషి అక్కడికి వస్తుండగా ఎస్ఐ గారితో వసుధార మాట్లాడుతూ మీరు ఆ గొంతు గుర్తుపట్టారా అది రిషి సార్ వాళ్ళ అన్నయ్య శైలేంద్ర గొంతు కదా అనడంతో వెనుక నుంచి అవునా అంటూ ఆశ్చర్యంగా అడుగుతారు.
అవును సార్ఆరోజు మేము తప్పు చేయడానికి ఈరోజు మీ మీద అటాక్ జరగడానికి కారణం శైలేంద్ర అని చెప్పడంతో మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు అని రిషి అడుగుతారు చెప్పిన మీరు నమ్మరని మేము చెప్పలేదు అనగా మరి ఇప్పుడు మాత్రం ఇలా నమ్ముతానని అనుకున్నావు అంటూ రిషి మాట్లాడతారు దీంతో వసుధార షాక్ అవుతుంది. ఒకప్పుడు నామీద నింద మోపారు ఇప్పుడు మా అన్నయ్య మీద అభియోగం మోపుతున్నారు అని రిషి వసుధార మాటలను కొట్టి పారేస్తారు దీంతో వసుధారా షాక్ అవుతుంది.