Vasundhara,Balakrishna: బాలయ్య సినిమాల్లో వసుంధరకు ఆ సినిమా ఇష్టమా.. ఏం జరిగిందంటే?

స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ సీనియర్ హీరోలలో వరుసగా హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకుని ప్రశంసలు అందుకున్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఈ సినిమాలు వేర్వేరుగా 70 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లు వచ్చాయి. బాలయ్య ప్రస్తుతం బాబీ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఎలాంటి అప్ డేట్స్ రాకుండానే ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా ఈ సినిమాకు సంబంధించి మరిన్ని క్రేజీ అప్ డేట్స్ వస్తే మాత్రం ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

అయితే బాలయ్య భార్య వసుంధరకు బాలయ్య సినిమాల్లో చెన్నకేశవరెడ్డి అంటే ఎంతో ఇష్టమట. వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద అబవ్ యావరేజ్ గా నిలిచింది. అయితే బాలయ్య ఎన్ని సినిమాల్లో నటించినా వసుంధర ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ సినిమానే అని సమాచారం. ఈ సినిమాతో పాటు బాలయ్య నటించిన సమరసింహారెడ్డి సినిమాను ఎక్కువగా చూస్తారట.

వసుంధర ఇష్టమైన ఈ సినిమాలు బాలయ్య అభిమానులకు కూడా ఇష్టమైన సినిమాలు అనే సంగతి తెలిసిందే. బాలయ్య బాబీ కాంబో మూవీ అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ ఏడాదే ఈ సినిమా రిలీజ్ కానుండగా ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి స్పష్టత రావాల్సి ఉంది.

బాలయ్యకు జోడీగా ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తున్నారని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. బాలయ్య సినిమాలు అంటే ప్రేక్షకులు యాక్షన్ సీన్లను ఆశిస్తారు. ఈ సినిమాలో సైతం ప్రేక్షకులు కోరుకున్న యాక్షన్ సీన్స్ ఉండనున్నాయని భోగట్టా. బాలయ్య (Balakrishna) పారితోషికం 30 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండటం గమనార్హం.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus