Gopichand: ‘వేదాలం’.. గోపీచంద్ సినిమాకు కాపీనా..16 ఏళ్ళ క్రితమే..!

  • September 28, 2024 / 02:15 PM IST

‘ఒకే లైన్ తో సినిమాలు చేసే దర్శకులు ఎక్కువ కాలం నిలబడటం కష్టం’ అని చాలా సార్లు ప్రూవ్ అయ్యింది.అలా చేసిన దర్శకులు త్వరగానే ఫేడౌట్ అయిపోయారు. తేజ, శ్రీను వైట్ల, వి.వి.వినాయక్..ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలానే ఉంది. మరో దర్శకుడు ‘సిరుతై’ శివ కూడా ఈ లిస్ట్..లోనే ఉండేవాడు. కానీ కోలీవుడ్ కి చెక్కేసి ఎస్కేప్ అయిపోయాడు. తమిళంలో ఇతను ‘వీరమ్’ (Viswasam) ‘వేదాలం’ (Vedalam) సినిమాలతో తమిళంలో స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు శివ (Siva) .

Gopichand

అజిత్ (Ajith), రజినీకాంత్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసి..అతని మార్కెట్ ని పెంచుకున్నాడు. ప్రస్తుతం సూర్యతో ‘కంగువా’ అనే భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. దీనిపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. శివ తన కెరీర్లో ఎక్కువగా ‘అన్నకి దూరమైన చెల్లెలు, కోల్-కతా బ్యాక్ డ్రాప్, మాఫియా’..లైన్లతో సినిమాలు చేశాడు. ‘వేదాలం’ తమిళంలో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. దీంతో రజినీకాంత్ తో కూడా అలాంటి సినిమానే చేశాడు.

‘అన్నాతే’ (Annaatthe) కథ దాదాపు ‘వేదాలం’ మాదిరే ఉంటుంది. అయితే ‘వేదాలం’ కథ కూడా కాపీనే. అది కూడా ఒక తెలుగు సినిమాకి..! 2009లో గోపీచంద్  (Gopichand ) హీరోగా ‘శౌర్యం’ (Souryam) అనే సినిమా వచ్చింది. ఇది దర్శకుడిగా శివకి మొదటి సినిమా. ఈ సినిమా కథని కనుక గమనిస్తే.. ‘చెల్లిని దూరం చేసుకున్న అన్న..

తర్వాత ఆమె కోసం కోల్ కతా రావడం, ఆమెకు విలన్ నుండి ప్రమాదం ఉండటం. హీరో చెల్లికి తెలియకుండా ఆమెను కాపాడటం’.. సరిగ్గా చూసుకుంటే ‘వేదాలం’ కథ కూడా అంతే..! ‘శౌర్యం’ కూడా తెలుగులో సూపర్ హిట్ అయ్యింది. నేటితో ‘శౌర్యం’ రిలీజ్ అయ్యి 15 ఏళ్ళు పూర్తి కావస్తోంది. కావాలంటే.. ఒకసారి ‘శౌర్యం’ చూడండి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus