చియాన్ విక్రమ్ (Vikram) హీరోగా నటించిన ‘వీర ధీర శూర’ (Veera Dheera Soora) సినిమా ఈరోజు రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఊహించని విధంగా ఈ సినిమా షోలు అన్నీ క్యాన్సిల్ అయ్యాయి. పీవీఆర్ వంటి సంస్థలు టికెట్ బుక్ చేసుకున్న వారికి డబ్బులు రిటర్న్ చేయడం జరిగింది. దీని కారణాలు ఏంటి అని ఆరాతీస్తే.. ఢిల్లీ హైకోర్టు ఈ సినిమా రిలీజ్ పై స్టే ఇచ్చినట్లు తెలిసింది. ఈ సినిమా నిర్మాణ సంస్థల్లో ఒకటైన ‘B4U’ సంస్థ నిర్మాతపై లీగల్ నోటీసులు ఇష్యు చేసినట్లు సమాచారం.
తమకి చెల్లించాల్సిన బ్యాలెన్స్ అమౌంట్ ఇంకా చెల్లించలేదు అని ఆరోపిస్తూ వారు ఢిల్లీ హైకోర్టుకెక్కినట్టు టాక్. దీంతో 48 గంటల్లోపు.. వారికి చెల్లించవలసిన అమౌంట్ చెల్లిస్తే కానీ.. సినిమా రిలీజ్ చేయడానికి వీల్లేదు అని హైకోర్టు తీర్మానించినట్లు స్పష్టమవుతుంది. నిర్మాత ఇప్పుడు ‘B4U’ సంస్థతో రాజీ కుదుర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు వినికిడి. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈవెనింగ్ షోలతో ‘వీర ధీర శూర’ రిలీజ్ అవుతుంది.
ఇక ‘వీర ధీర శూర’ సినిమాని ‘సేతుపతి’ (Vijay Sethupathi) ‘చిన్నా’ వంటి సినిమాలు అందించిన ఎస్.యు.అరుణ్ కుమార్ (S. U. Arun Kumar) డైరెక్ట్ చేశాడు. రెండు పార్టులుగా రూపొందిన ఈ సినిమా రెండో భాగాన్ని ముందుగా రిలీజ్ చేయడానికి డిసైడ్ అయ్యారు మేకర్స్. ఎస్.జె.సూర్య ఈ సినిమాలో కీలక పాత్ర పోషించాడు. 30 ఇయర్స్ పృథ్వీ కూడా ముఖ్య పాత్ర పోషించడం జరిగింది. నెవర్ బిఫోర్ మాస్ అవతార్లో విక్రమ్ కనిపించబోతున్నాడు అని టీజర్ తో అందరికీ క్లారిటీ వచ్చింది.