‘‘బాలయ్య బాబు వీరాభిమానిగా ‘వీర సింహా రెడ్డి’ తీస్తున్నాను.. నో డౌట్, సినిమా సూపర్ హిట్’’ అంటూ అభిమానుల్లో అంచనాలు పెంచేశాడు డైరెక్టర్ గోపిచంద్ మలినేని.. బాలయ్య ద్విపాత్రాభినయం చేసిన సినిమాలు చాలా వరకు సూపర్ డూపర్ హిట్స్ అయ్యాయి.. ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ తర్వాత డ్యుయల్ రోల్ చేయడం.. ‘సింహా’ తర్వాత తండ్రీకొడుకులుగా కనిపించడం ఈ మూవీలోనే కావడం విశేషం.. అందులోనూ నటసింహా కెరీర్‌లో ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన ‘సింహా’ పదం పేరులో ఉండడం,
బాక్సాఫీస్ బొనంజా ట్రెండ్ సెట్ చేసిన ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ కావడం పెద్ద ప్లస్ పాయింట్స్.. ఇవన్నీ పక్కన పెడితే ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతోందని, లేదు.. లేదు.. చేస్తే బాగుంటుందని కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి.. ఎందుకు పాన్ ఇండియా అంటే కొన్ని కారణాలు కూడా వినిపిస్తున్నాయి.. ‘వీర సింహా రెడ్డి’ లో కోలీవుడ్‌కి చెందిన వరలక్ష్మీ శరత్ కుమార్, కీలకపాత్రలో పాపులర్ మలయాళ నటుడు లాల్, నటి హనీ రోజ్ ఉన్నారు..
విలన్‌గా శాండల్ వుడ్‌కి చెందిన స్టార్ హీరో ‘దునియా’ విజయ్, ‘కె.జి.యఫ్’ ఫేమ్ అవినాష్ కూడా నటిస్తున్నారు. సో, ఈ లెక్కన నాలుగు భాషలకు చెందిన యాక్టర్స్.. కచ్చితంగా ఎవరో ఒక బాలీవుడ్ నటుడు ఇంకో విలన్‌గా కనిపించొచ్చు.. మూవీ టీం ఇప్పటివరకు ఆ విషయం రివీల్ చెయ్యకపోవచ్చు.. కాబట్టి తెలుగు, హిందీ, తమిళ్, కన్నడంతో మలయాళంలోనూ విడుదల చేస్తే బాలయ్యకి ఫస్ట్ పాన్ ఇండియా మూవీ అవుతుంది.. పైగా డైరెక్టర్ కాన్ఫిడెన్స్ చూస్తే పక్కా హిట్ అయ్యేలా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఫ్యాన్స్, మూవీ లవర్స్ కంపేరిజన్ బాగానే ఉంది కానీ.. అసలు తెలుగులో సంక్రాంతి రిలీజ్ అంటేనే థియేటర్ల కోసం దబిడి దిబిడి అనే రేంజ్‌లో పోటీ నెలకొంది.. ‘ఆదిపురుష్’, ‘ఏజెంట్’ తప్పుకున్నా కానీ సేమ్ బ్యానర్ నిర్మిస్తున్న చిరు సినిమా ‘వాల్తేరు వీరయ్య’, దిల్ రాజ్, విజయ్‌ల ‘వారసుడు’, అజిత్ ‘తునివు’ ఉన్నాయి.. ఇప్పటికే బాలయ్య బొమ్మకంటే విజయ్ మూవీకే థియేటర్లు ఎక్కువ ఇస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి.. తమిళనాట విజయ్, అజిత్ చిత్రాలకే థియేటర్లు దొరకని పరిస్థితి.. ఇలాంటప్పుడు బాలయ్య సినిమా పాన్ ఇండియా రిలీజ్ అంటే కష్టమే కదా మరి..
యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?
‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!