Veera Simha Reddy: వీరసింహా విషయంలో మైత్రీ నిర్మాతలు అలా ప్లాన్ చేశారా?

బాలయ్య గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న వీరసింహారెడ్డి మూవీ ఈవెంట్ జనవరి నెల 6వ తేదీన ఒంగోలులో గ్రాండ్ గా జరగనుంది. ఈ ఈవెంట్ జరగడానికి మరో పది రోజుల సమయం మాత్రమే ఉండగా రికార్డ్ స్థాయిలో బాలయ్య ఫ్యాన్స్ ఈ ఈవెంట్ కు హాజరు కానున్నారని తెలుస్తోంది. అయితే ఈ ఈవెంట్ కు హాజరయ్యే అతిథులకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఆ వార్త ప్రకారం మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఈ ఈవెంట్ కు అతిథులుగా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

బాలయ్య పవన్ కళ్యాణ్ మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. రేపు బాలయ్య పవన్ కాంబినేషన్ లో అన్ స్టాపబుల్ షో ఎపిసోడ్ షూట్ జరగనుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా స్ట్రీమింగ్ కానున్న ఈ స్పెషల్ ఎపిసోడ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీరసింహారెడ్డి ఈవెంట్ కు చిరంజీవి, పవన్ హాజరవుతారని అదే సమయంలో వాల్తేరు వీరయ్య ఈవెంట్ కు బాలయ్య హాజరవుతారని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ రెండు సినిమాలను నిర్మించిన నేపథ్యంలో ఈ వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే చిరంజీవి, పవన్ ఈ ఈవెంట్ కు హాజరవుతున్నట్టు అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. చిరంజీవి, బాలయ్య ఒకరి సినిమాలకు మరొకరు సపోర్ట్ చేస్తే మాత్రం ఫ్యాన్స్ ఎంతో సంతోషిస్తారు. సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ రెండు సినిమాలు సక్సెస్ సాధించాలని మెగా, నందమూరి ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమాలు తమ హీరోల కెరీర్ లో స్పెషల్ సినిమాలుగా నిలుస్తాయని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

మైత్రీ నిర్మాతలు 250 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ రెండు సినిమాలను నిర్మించారు. ఈ రెండు సినిమాలలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాలు సక్సెస్ సాధిస్తే మరో రెండు మూడేళ్ల పాటు శృతి హాసన్ వరుస ఆఫర్లతో బిజీ అయ్యే ఛాన్స్ అయితే ఉంది.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus