Veera Simha Reddy Trailer: మాస్ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో ప్యాక్ చేసిన ‘వీరసింహారెడ్డి’ ట్రైలర్..!

‘అఖండ’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత నందమూరి బాలకృష్ణ నుండి రాబోతున్న చిత్రం ‘వీరసింహారెడ్డి’. ‘క్రాక్’ తో స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన గోపీచంద్ మలినేని ఈ చిత్రానికి దర్శకుడు కాగా అగ్ర నిర్మాణ సంస్థ అయిన ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. దునియా విజయ్ విలన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది.

శృతి హాసన్, హనీ రోజ్ లు హీరోయిన్స్. సంక్రాంతి కానుకగా ‘వీరసింహారెడ్డి’ జనవరి 12న విడుదల కాబోతోంది. ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన గ్లింప్స్ కు అలాగే జై బాలయ్య, సుగుణ సుందరి, మా బావ మనోభావాలు.. వంటి పాటలు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుండి ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు.

ఈ ట్రైలర్ 2 నిమిషాల 24 సెకన్ల నిడివి కలిగి ఉంది. ట్రైలర్ మొత్తం మాస్ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో నిండి ఉంది. ట్రైలర్ మొత్తానికి బాలయ్యే హైలెట్ గా నిలిచాడు. బాలయ్య ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చే విధంగా ఉంది అని చెప్పొచ్చు.

“సీమలో ఏ ఒక్కడూ కత్తి పట్టకూడదు అని నేనొక్కడినే కత్తి పట్టా.. పరపతి కోసమో, పెత్తనం కోసమో కాదు, ముందు తరాలు నాకిచ్చిన బాధ్యత, నాది ఫ్యాక్షన్ కాదు, సీమ మీద ఎఫెక్షన్

పుట్టింది పులిచర్ల చదివింది అనంతపురం రూలింగ్ కర్నూల్

మైలురాయికి మీసం మొలిచినట్టు ఉండాది రా

పది నిమిషాల్లో క్లోజ్ అయ్యే ఏ పబ్బు దగ్గరకైనా వెళ్లి నిలబడు అక్కడ నీకు ఓ స్లోగన్ వినిపిస్తుంది! (జై బాలయ్య) అది..!

అపాయింట్మెంట్ లేకుండా వస్తే అకేషన్ చూడను, లొకేషన్ చూడను… ఒంటి చేత్తో ఊచకోత కోస్తా నా కొడకా

సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో కానీ ఆ చరిత్ర సృష్టించిన వారి పేరు మారదు.. మార్చలేరు

పదవి చూసుకుని నీకు పొగరేమో.. బై బర్త్ నా డి.ఎన్.ఎ కే పొగరెక్కువ ” వంటి డైలాగులు హైలెట్ గా నిలిచాయి.

ట్రైలర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus