Veera Simha Reddy: రాజకీయ డైలాగ్‌లు కలిసొస్తాయా.. కుదిపేస్తాయా?

  • January 8, 2023 / 12:14 AM IST

‘వీర సింహా రెడ్డి’ సినిమా అంతా ఫ్యాక్షన్‌మయం అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమా పేరు, ట్రైలర్‌ చూస్తే ఎవరైనా చెప్పేస్తారు. అయితే ఈ సినిమాలో బాలయ్య తన రాజకీయ ఆలోచనలు కూడా చెప్పాలనుకుంటున్నారా? సినిమా ట్రైలర్‌ చూస్తే అవుననే అనిపిస్తోంది. ట్రైలర్‌లోని కొన్ని డైలాగ్స్‌ వింటుంటే.. తన పార్టీ టీడీపీకి అనుకూలంగా బాలయ్య ఆ మాటలు చెప్పారు అని అనుకుంటున్నారు నెటిజన్లు. అంటే ‘వీర సింహా రెడ్డి’లో నేరుగా ప్రభుత్వాన్ని, ప్రభుత్వంలో ఉన్న పార్టీని విమర్శించారు అని కాదు. కానీ ఇన్‌డైరక్ట్‌గా అన్నారు అని.

సంక్రాంతి కానుకగా ‘వీర సింహా రెడ్డి’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్ జరిగింది. అలాగే ట్రైలర్‌ని కూడా విడుదల చేశారు. అందులో డైలాగ్‌లు ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారాయి. ఏపీ సర్కారుపై, ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై పరోక్షంగా వేసిన పంచ్‌ల గురించి ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. కొన్ని నెలల క్రితం వైఎస్‌ జగన్ ప్రభుత్వం ఎన్టీఆర్ యూనివర్సిటీకి పేరు మార్చింది.

చాలా ఏళ్ల నుండి ఉన్న ఎన్టీఆర్‌ పేరును తీసేసి మాజీ ముఖ్యమంత్రి దివంగత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టారు. అప్పట్లో ఈ విషయం గురించి.. టీడీపీ బాగానే నిరసన వ్యక్తం చేసింది. కానీ ప్రభుత్వం ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఈ నేపథ్యంలో ‘వీర సింహా రెడ్డి’లో దాని మీద కౌంటర్‌ ఉంది అని గత కొన్ని రోజులుగా లీకులు వచ్చాయి. ఆ లీక్‌లను నిజం చేస్తూ… “సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో, కానీ ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు, మార్చలేరు” అనే డైలాగ్‌తో పరోక్షంగా పంచ్ వేశాడు బాలయ్య.

దాంతోపాటు “పదవి చూసుకొని మీకు పొగరేమో… బై బర్త్ నా డిఎన్ఏకే పొగరెక్కువ” అని కూడా అన్నారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బాలినేని శ్రీనివాస‌రెడ్డి పేరు ఆ ఈవెంట్‌లో ప్రముఖంగా వినిపించింది. కార్య‌క్ర‌మం విజ‌య‌వంతం జ‌ర‌గ‌డానికి ఆయ‌న స‌హ‌కారం అందించార‌ని ద‌ర్శ‌కుడు గోపిచంద్ మ‌లినేని ధన్యవాదాలు కూడా చెప్పారు. ఒంగోలు ప్రాంతానికి చెందిన గోపిచంద్ మ‌లినేని త‌న సొంత జిల్లాలో సినిమా ఫంక్ష‌న్ పెట్టుకోవాల‌నే ల‌క్ష్యాన్ని పెట్టుకున్నారు.

ఈ క్రమంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఫైనల్‌గా సాధించారు. అయితే దీని వెనుక బాలినేని సాయం ఉందని అంటున్నారు. అయితే సినిమాల్లో వైఎస్‌ఆర్‌సీపీ నాయకుల్ని పరోక్షంగా విమర్శిస్తూ.. ఇలా నేరుగా ఆ పార్టీని రిక్వెస్ట్‌లు చేయడం ఏంటో అర్థం కావడం లేదు అని నెటిజన్లు అంటున్నారు. ఏమో లోగుట్టు బాలయ్యకే ఎరుక.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus