Venkaiah Naidu: ‘సీతారామం’ సినిమాపై మాజీ ఉప రాష్ట్రపతి కామెంట్!

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన సినిమా ‘సీతారామం’. ఆగస్టు 5న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. లవ్ స్టోరీల్లో ఇదొక క్లాసిక్ గా నిలిచింది. ఈ సినిమాకి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా చూసిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారు. ”సీతా రామం చిత్రాన్ని వీక్షించాను.

నటీనటులు అభినయానికి, సాంకేతిక విభాగాల సమన్వయం తోడై చక్కని దృశ్యకావ్యం ఆవిష్కృతమైంది. సాధారణ ప్రేమ కథలా కాకుండా.. దానికి వీర సైనికుని నేపథ్యాన్ని జోడించి, అనేక భావోద్వేగాలను ఆవిష్కరించిన ఈ చిత్రం ప్రతి ఒక్కరూ తప్పక చూడదగినది. చాలా కాలం తర్వాత ఓ చక్కని సినిమా చూసిన అనుభూతిని ‘సీతారామం’ అందించింది. రణగొణ ధ్వనులు లేకుండా, కళ్లకు హాయిగా ఉండే ప్రకృతి సౌందర్యాన్ని ఆవిష్కరించిన ఈ చిత్ర దర్శకుడు శ్రీ హను రాఘవపూడి,

నిర్మాత శ్రీ అశ్వినీదత్, స్వప్న మూవీ మేకర్స్ సహా చిత్ర బృందానికి అభినందనలు” అంటూ రాసుకొచ్చారు. అలానే ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ఫొటోలను ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ ట్వీట్ చూసిన దుల్కర్ సల్మాన్.. ‘హృదయపూర్వక కృతజ్ఞతలు సర్’ అంటూ బదులిచ్చారు.

ఇక ఈ సినిమా విషయానికొస్తే.. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో రష్మిక కీలకపాత్ర పోషించింది. నటుడు సుమంత్, తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్రలు పోషించారు. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో వైజ‌యంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యాన‌ర్స్‌పై ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ ఈ సినిమాను నిర్మించారు.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus