Saindhav: ఆ చిత్రాల్లో కూడా నటిస్తానని చెప్పిన వెంకటేశ్.. ఏం చెప్పారంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని సీనియర్ హీరోలలో విక్టరీ వెంకటేశ్ కు ఊహించని స్థాయిలో క్రేజ్ ఉందనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం విభిన్నమైన కథలకు ఓటేస్తున్న వెంకటేశ్ సైంధవ్ సినిమాతో సక్సెస్ ను అందుకుంటానని నమ్మకంతో ఉన్నారు. విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న వెంకటేశ్ ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ సైంధవ్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. జనవరి 13వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తామని ఆయన అన్నారు.

సరికొత్త కథ, కథనంతో ఈ సినిమా తెరకెక్కిందని ఈ మూవీలో యాక్షన్, ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులకు నచ్చేలా ఉంటాయని పేర్కొన్నారు. డైరెక్టర్ శైలేష్ కొలను కథ చెప్పిన వెంటనే ఈ సినిమాలో నటించడానికి అంగీకరించానని ఆయన అన్నారు. శ్రద్ధ ఈ సినిమాలో బాగా నటించిందని వెంకటేశ్ కామెంట్లు చేశారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లో సైతం ఈ సినిమా రిలీజ్ కానుంది.

ప్రేక్షకులు మెచ్చితే సైంధవ్2 (Saindhav) కూడా తీస్తామని చాలా సంవత్సరాల తర్వాత ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నానని వెంకటేశ్ అన్నారు. బాబాయ్ హోటల్ లో టిఫిన్ చేశానని చాలా సంతోషంగా అనిపించిందని వెంకటేశ్ చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో మరిన్ని మల్టీస్టారర్ సినిమాలలో నటిస్తానని ఆయన కామెంట్లు చేశారు. వెంకీ చెప్పిన విషయాలు ఫ్యాన్స్ కు మరింత సంతోషాన్ని కలిగిస్తున్నాయి.

వెంకటేశ్ రెమ్యునరేషన్ 12 నుంచి 15 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. వెంకటేశ్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో మరిన్ని సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. వెంకటేశ్ కథల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. రాబోయే రోజుల్లో వెంకటేశ్ సినిమాల పరంగా మరిన్ని సంచలనాలను సృష్టిస్తారేమో చూడాల్సి ఉంది. వెంకీకి ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది. వెంకటేశ్ సైంధవ్ తో పాన్ ఇండియా హిట్ సాధిస్తే భవిష్యత్తు సినిమాలపై కూడా అంచనాలు పెరిగే అవకాశం ఉంది. వెంకీ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus