Venkatesh: ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ కి సీక్వెల్.. వెంకటేష్ ఏమన్నారంటే?

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా రిలీజ్ అయ్యి నేటితో అంటే జనవరి 11తో 11 ఏళ్ళు పూర్తి చేసుకుంది. 2013 జనవరి 11 న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. వెంకటేష్ – మహేష్ బాబు.. కలిసి నటించిన మల్టీస్టారర్ సినిమా ఇది. టాలీవుడ్లో మల్టీస్టారర్లు రావడం ఆగిపోయిన టైంలో వచ్చిన ఈ సినిమా.. ఎవ్వరూ ఊహించని విధంగా సూపర్ సక్సెస్ అందుకుంది. పెద్దోడుగా వెంకటేష్, చిన్నోడుగా మహేష్ బాబు..

చాలా చక్కగా నటించి మెప్పించారు. ఈ సినిమా తర్వాత మళ్ళీ మల్టీస్టారర్ సినిమాలు రావడం పెరిగాయి. ‘ఆర్.ఆర్.ఆర్’ వంటి సినిమా రావడానికి కూడా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ స్ఫూర్తి అని చెప్పొచ్చు. అయితే ‘సైంధవ్’ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న వెంకటేష్ కి ఈరోజు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా గురించి ఓ ప్రశ్న ఎదురైంది. ఈ సినిమాకి సీక్వెల్ ఏమైనా ఉండొచ్చా అని (Venkatesh) వెంకటేష్ ని అడిగితే.. ఆయన ఓ ఫన్నీ ఆన్సర్ ఇచ్చారు.

”ఈమ‌ధ్యనే సోషల్ మీడియాలో ఓ పోస్ట‌ర్ చూశాను. ‘సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు 2 ‘ కి ఫ్యాన్ మేడ్ పోస్ట‌ర్ అనుకుంట అది. అందులో నేనూ, మ‌హేష్ చాలా వైల్డ్ గా ఉన్నాం. ఓ యాక్ష‌న్ సినిమాకి సంబంధించిన పోస్టర్లా అది అనిపించింది. చాలా ఫన్నీగా ఉంది” అంటూ చెప్పారు. అంటే ‘బోయపాటి స్టయిల్లోనా?’ అని అడిగితే ఆయన తెగ నవ్వుకున్నారు.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus