Venkatesh: ‘హిట్’ డైరెక్టర్ తో వెంకీ థ్రిల్లింగ్ యాక్షన్!

సీనియర్ హీరో వెంకటేష్ ఈ ఏడాది ‘ఎఫ్3’ సినిమాతో ప్రేక్షకులను అలరించారు. అలానే ‘ఓరి దేవుడా’ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించారు. ఈసారి రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా.. రియలిస్టిక్ కాన్సెప్ట్ తో సినిమాలు చేయాలనుకుంటున్నారు. ఈ క్రమంలో ‘హిట్’ ఫేమ్ శైలేష్ కొలనుతో కలిసి సినిమా చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. ఈ సినిమా వెంకటేష్ కెరీర్ లోనే కాస్ట్లీ సినిమాగా తెరకెక్కనుంది.

ఎక్కువ శాతం బడ్జెట్ యాక్షన్ సన్నివేశాల కోసమే ఖర్చు చేయబోతున్నారట. యాక్షన్ ఎపిసోడ్స్ ను స్పెషల్ గా డిజైన్ చేయిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం బెస్ట్ టెక్నీషియన్స్ ను ఆన్ బోర్డ్ చేసుకోబోతున్నారు. నీహారిక ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించబోతుంది. ఇటీవల ‘హిట్2’తో భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు శైలేష్ కొలను.. ఇప్పుడు వెంకటేష్ హీరోగా హిట్ సినిమా తీయాలనుకుంటున్నారు. వెంకీ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్లుగా కథ ఉంటుందట.

అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా సినిమాను తెరకెక్కించారు. ప్రస్తుతం వెంకీ ఓ బాలీవుడ్ సినిమాలో నటిస్తున్నారు. సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతోన్న ‘కిసీకా భాయ్ కిసీకా జాన్’ అనే సినిమాలో వెంకీ కీలకపాత్ర పోషిస్తున్నారు. అలానే ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్ లో నటించారు. ఇందులో రానా కూడా కనిపించనున్నారు. ఇది కూడా యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిందే. ఇక శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకీ చేయబోయే సినిమా 2023లో మొదలుకానుంది.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus