Venkatesh: మరో యంగ్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చిన వెంకటేష్!

విక్టరీ వెంకటేష్ (Venkatesh) చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నారు. అంత ఈజీగా ఏ కథకి ఓకే చెప్పడం లేదు. తరుణ్ భాస్కర్ (Tharun Bhascker), శ్రీనాథ్ రావ్ నక్కిన (Trinadha Rao) వంటి దర్శకులతో సినిమాలు చేయడానికి రెడీ అని చెప్పినా, తర్వాత కొన్ని కారణాల వల్ల వాటిని పక్కన పెట్టాడు. త్రివిక్రమ్ (Trivikram) కూడా వెంకీతో సినిమా చేయాలని చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నాడు. కానీ వెంకటేష్ ఏ కథకి ఓకే చెప్పడం లేదు.

Venkatesh

సీనియర్ హీరోలు కూడా రెండేసి, మూడేసి సినిమాలు ఓకే చేసుకుని.. బ్యాకప్ గా పెట్టుకుంటుంటే, వెంకీ మాత్రం.. ఆ దిశగా అడుగులు వేయడం లేదు. ‘సైందవ్’  (Saindhav) తర్వాత వెంకీ నుండి వస్తున్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki Vasthunnam) . అనిల్ రావిపూడి (Anil Ravipudi) పై వెంకీకి నమ్మకం ఎక్కువ. వీళ్ళ కాంబినేషన్లో ‘ఎఫ్ 2’ (F2 Movie) , ‘ఎఫ్‌ 3’ (F3 Movie) సినిమాలు వచ్చాయి. అవి మంచి సక్సెస్..లు అందుకున్నాయి. పైగా 2025 సంక్రాంతికి ఎక్కువ లాభాలు మిగిల్చే సినిమా ఇదే అవుతుందని అంతా భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ స్టార్ట్ అయ్యి ఏడాది కావస్తున్నా.. వెంకీ నెక్స్ట్ ఏ సినిమాని మొదలుపెట్టలేదు. అయితే ‘డిజె టిల్లు’ (DJ Tillu) దర్శకుడు విమల్ కృష్ణ చెప్పిన కథకి వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తాజా సమాచారం. ఈ కథ కూడా హిలేరియస్ గా ఉంటుందట.

వెంకటేష్ కామెడీ సినిమా చేశాడు అంటే 90 శాతం సక్సెస్ సాధించే అవకాశాలు ఉన్నాయి. ఇక విమల్ కృష్ణ డైరెక్ట్ చేసిన ‘డిజె టిల్లు’ లో కూడా కామెడీ అదిరిపోతుంది. అలా చూసుకుంటే ఇది క్రేజీ కాంబినేషన్ అనే చెప్పాలి. ఇక ఈ ప్రాజెక్టుని శ్రీనివాసా చిట్టూరి నిర్మించే అవకాశాలు ఉన్నాయి.

రేణు దేశాయ్ తల్లి కన్నుమూత.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus