అప్పుడు వెంకీ ఏం చేయగలుగుతాడు.. ఇప్పుడు వెంకీ మాత్రమే చేయగలడు!

“అసురన్” సినిమాలో ధనుష్ నటవిశ్వరూపం చూసినప్పట్నుండి.. తమిళ సినిమా ఫ్యాన్స్ తోపాటు తెలుగు సినిమా అభిమానులకు కూడా ఒకటే డౌట్ “వెంకీ ఆ క్యారెక్టర్ లో ఇమడగలాడా?” అని. అందులోనూ మంచి సినిమాలు, మంచి పాత్రలకు కేరాఫ్ అడ్రెస్ అయిన శ్రీకాంత్ అడ్డాల లాంటి పక్కా క్లాస్ డైరెక్టర్ ఇలాంటి మాస్ సినిమాను హ్యాండిల్ చేయగలడా అని కూడా జనాలు తెగ ఆలోచించేశారు. అలాంటి ఆలోచనలను, అనుమానాలను ఫస్ట్ లుక్ తో తునాతునకలు చేసేశారు వెంకీ & శ్రీకాంత్ అడ్డాల.

నిన్న రాత్రి విడుదలైన “నారప్ప” ఫస్ట్ లుక్ పోస్టర్స్ సెన్సేషన్ క్రియేట్ చేశాయి. అసురన్ అనే క్యారెక్టర్ లో ధనుష్ ఎంత పర్ఫెక్ట్ గా సరిపోయాడో.. నారప్ప అనే పాత్రలో వెంకీ కూడా అదే స్థాయిలో సరిపోయాడు. ఆ మీసకట్టు, గెడ్డం, లుక్స్, గెటప్ & బాడీ లాంగ్వేజ్ ఒక సరికొత్త వెంకటేష్ ను ఈ జనరేషన్ కు పరిచయం చేశాయి. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యింది.. వెంకీ సరసన ప్రియమణి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయన కుమారులుగా ఎవరు నటిస్తున్నారు అనేది తెలియాల్సి ఉంది.

1

2

3

4

5

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus