టాలీవుడ్‌లో స్టార్ హీరోలు రీమేక్‌లు చేయడం కొత్త కాదు. ఇటీవల వరుస పరాజయాలు వస్తున్నాయి కాబట్టి రీమేకులు చేయడం ఏదో తప్పులా చూస్తున్నారు కానీ… టాలీవుడ్‌లో ఎన్నో ఏళ్లుగా రీమేక్‌లు వస్తున్నాయి. సీనియర్ స్టార్ హీరోలు అయితే ఈ సినిమాలు చేసి చాలాసార్లు మెప్పించారు కూడా. అలా ఎక్కువసార్లు చేసిన హీరో వెంకటేశ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆయన రీమేక్‌ల విజయం శాతం అందరి కంటే ఎక్కువే ఉంటుంది. ఇప్పుడు ఆయన మరో రీమేక్ మీద దృష్టి సారించారు అని అంటున్నారు.
దేశం మొత్తం ‘సలార్’, ‘డంకీ’ సినిమాల గురించి మాట్లాడుతోంది కానీ… సౌత్ డౌన్‌లో మరో సినిమా కూడా క్రిస్మస్ కానుకగా విడులైంది. మిగిలిన రాష్ట్రాల్లో ఏ మాత్రం ప్రచారం లేకుండా ఓన్లీ కేరళలో సూపర్ ప్రచారంతో వచ్చిన సినిమా ‘నేరు’. మోహన్ లాల్ ప్రధాన పాత్రలో వచ్చిన ఆ కోర్ట్ రూమ్ డ్రామా ఇప్పుడు అదిరిపోయే విజయాన్ని అందుకుంది. లాలెటెన్‌కు అదిరిపోయే ‘దృశ్యం’ విజయాలను అందించిన జీతూ జోసెఫ్ ఈ సినిమాకు దర్శకుడు.
ఆ రెండు సినిమాలను తెలుగులోకి తీసుకొచ్చిన వెంకటేశ్ ఇప్పుడు ‘నేరు’ గురించి నేరుగా మాట్లాడారు అని చెబుతున్నారు. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో అలరించిన ఈ సినిమాను తెలుగులో చేస్తే బాగుంటుంది అనేది ఆయన ఆలోచనట. అందుకే ఈ సినిమాను తెలుగు రీమేక్ చేయాలని అనుకుంటున్నారట. ఈ క్రమంలో చర్చలు మొదలయ్యాయి అని చెబుతున్నారు. ‘దృశ్యం 2’తో జీతూ జోసెఫ్ తెలుగులో కూడా సుపరిచితులే. మరి ‘నేరు’ ఇక్కడకు వస్తే ఆయన కూడా వస్తారా అనేది చూడాలి.
అన్నట్లు ‘నేరు’ సినిమా డబ్బింగ్ రైట్స్ ఎవరికీ ఇవ్వలేదట. ఈ సినిమా ఫలితం, కథ మీద నమ్మకంతో నిర్మాణ సంస్థ రీమేక్ కోసమే పక్కన పెట్టిందట. ఇప్పుడు సురేశ్ ప్రొడక్షన్స్‌తో కలసి ఆ సినిమా చేసే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా పాయింట్ చూస్తే… చూపు లేని అమ్మాయి మానభంగానికి గురైతే దోషులను పట్టించే క్రమంలో హీరో (లాయర్) ఎలా సాయం చేశాడు అనేదే కథ. వెంకటేష్ చేస్తే ఈ సినిమా ‘ధర్మచక్రం’ రేంజిలో ఉంటుంది అని అభిమానులు అంటున్నారు.
సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!
డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!