Venkatesh: స్టార్స్ అందరితో నటించడానికి సిద్ధంగా ఉన్నాను!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి విక్టరీ వెంకటేష్ ఇప్పటికి వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇకపోతే వెంకటేష్ ఒకవైపు వరుస సినిమాలలో సోలోగా నటిస్తూనే మరోవైపు టాలీవుడ్ స్టార్ట్స్ తో కలిసి మల్టీ స్టార్ సినిమాలలో కూడా నటిస్తున్నారు. ఇప్పటికే ఈయన ఎంతోమంది యంగ్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న సంగతి తెలిసింది. ఇలా సినిమాలలో నటిస్తూనే ఈయన వెబ్ సిరీస్ లలో కూడా నటించారు.

ఇక వెంకటేష్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన సైందవ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా జనవరి 12వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో వెంకటేష్ ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఇటీవల ఈయన చిత్ర బృందంతో కలిసి విజయవాడ చేరుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఇలా అమ్మవారి దర్శనం తర్వాత చిత్రబంధం మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

మీడియా ప్రతినిధుల నుంచి వెంకటేశ్ కు ప్రశ్నలు ఎదురయ్యాయి. మీ డ్రీమ్ రోల్స్ ఏవైనా ఉన్నాయా అంటూ మీడియా వారు ప్రశ్నించగా తనకు ఎలాంటి డ్రీమ్ రోజు లేవని తనకు పాత్ర నచ్చితే ఎలాంటి సినిమాలు అయినా కూడా చేస్తాను అంటూ ఈయన తెలియజేశారు. ఇక ఇప్పటివరకు పలువురు స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నటువంటి మీరు తదుపరి ఏ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారన్న ప్రశ్న కూడా ఎదురైంది.

ఈ ప్రశ్నకు వెంకటేశ్ (Venkatesh) సమాధానం చెబుతూ తాను అల్లు అర్జున్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటాను అలాగే ఎన్టీఆర్ తో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటానని ఇండస్ట్రీలో ఉన్నటువంటి సార్స్ అందరితో కలిసి నటించే అవకాశం వస్తే తప్పనిసరిగా నటిస్తానంటూ ఈ సందర్భంగా మల్టీ స్టార్ సినిమాల గురించి వెంకటేష్ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus