Venkatesh, Balakrishna: అన్ స్టాపబుల్ షోలో సందడి చేయనున్న వెంకటేష్..ఇక సందడే సందడి!

నటి సింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ రియాలిటీ షో ఆహాలో ప్రసారం అవుతూ దేశంలో నెంబర్ వన్ రియాలిటీ షో గా గుర్తింపు పొందింది. బాలకృష్ణ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న ఈ షో కి ఊహించని స్థాయిలో ప్రేక్షకాదరణ లభించి మంచి రేటింగ్స్ తో దూసుకుపోతోంది. ఇలా ఇప్పటికే అన్ స్టాపబుల్ మొదటి సీజన్ పూర్తి చేసుకుని.. ఇటీవల అన్ స్టాపబుల్ సీజన్ 2 కూడా ప్రారంభం అయింది.

మొదటి సీజన్లో ఎంతోమంది నటి నటులను అతిధులుగా ఆహ్వానించి సందడి చేసిన బాలకృష్ణ రెండవ సీజన్ మొదటి ఎపిసోడ్ లోనే తన బాబా చంద్రబాబు నాయుడు.. అలాగే అల్లుడు నారా లోకేష్ తో కలిసి సందడి చేశాడు. ఎప్పుడు రాజకీయాలతో బిజీగా ఉండే చంద్రబాబు నాయుడు ఇలా మొట్టమొదటిసారిగా ఒక రియాలిటీ షోలో పాల్గొనడమే కాకుండా… ఈ షో లో ఎంతో సరదాగా స్పందించి పేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక ఈ షో లో బాలకృష్ణ చంద్రబాబు నాయుడు మధ్య జరిగింది సంభాషణ ఎంతో ఆసక్తికరంగా ఉంది.

ఇలా వీరిద్దరూ వ్యక్తిగత విషయాలే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవహారాల గురించి కూడా చర్చించుకున్నారు. ఇలా మొదటి ఎపిసోడ్ స్ట్రీమ్ అయిన కొన్ని నిమిషాలకి ఊహించని రీతిలో వ్యూస్ సాధించి రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇక అన్ స్టాపబుల్ సీజన్ 2 రెండవ ఎపిసోడ్ లో యంగ్ హీరోలు సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్సేన్ తో కలిసి కుర్రాడిలా బాలకృష్ణ చేసిన అల్లరి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

అయితే మూడవ ఎపిసోడ్లో మొదటి ఎపిసోడ్ ని టెలికాస్ట్ చేయటంతో ప్రేక్షకులు కొంతవరకు అసహనం వ్యక్తం చేశారు. అయితే తాజాగా నాలుగవ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేసి షోపై హైప్ క్రియేట్ చేశారు. ఈ నాల్గవ ఎపిసోడ్ నవంబర్ 4వ తేదీన ప్రసారం కానుంది. ఈ నాలుగవ ఎపిసోడ్లో యంగ్ హీరోలు టాలెంటెడ్ శర్వానంద్, అడవి శేష్ గెస్ట్ లుగా హాజరు కానున్నారు. తాజాగా విడుదలైన ప్రోమో చాలా ఆసక్తికరంగా ఉంది.

ఇక ఈ ఎపిసోడ్ తర్వాత అండ్ స్టాపబుల్ షో లో పాల్గొనే గెస్ట్ గురించి ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం అన్ స్టాపబుల్ సీజన్ 2 ఐదవ ఎపిసోడ్లో విక్టరీ వెంకటేష్ గెస్టుగా హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఇలా బాలయ్య, విక్టరీ వెంకటేష్ ఇద్దరిని కలిపి ఒకే వేదికపై చూడాలని అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus