ఈ ఏడాది వెంకీ నుండి మూడు సినిమాలు!

సీనియర్ హీరో వెంకటేష్ వరుస సినిమాలు లైన్లో పెడుతున్నాడు. ఇప్పటికే తమిళ సినిమా ‘అసురన్’ రీమేక్ గా తెరకెక్కుతోన్న ‘నారప్ప’ సినిమా షూటింగ్ ఫినిషింగ్ స్టేజ్ లో ఉంది. ఈ సినిమాను మే 14న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ కూడా చేశారు. మరోపక్క అనీల్ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్ 3’ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇవి రెండు కాకుండా రీసెంట్ గా ‘దృశ్యం 2’ సినిమాను మొదలుపెట్టాడు. అయితే ‘ఎఫ్ 3’ సినిమా కంటే ముందుగా ‘దృశ్యం 2’ని రిలీజ్ చేయనున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

‘ఎఫ్ 3’ సినిమాను ఈ ఏడాది ఆగస్టులో విడుదల చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. దానికంటే ముందే జూన్, జూలై నెలల్లో ‘దృశ్యం 2’ని రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. ‘దృశ్యం2’ సినిమాను కేవలం 25 కాల్షీట్స్ లో చిత్రీకరించేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ లో ‘ఎఫ్ 3’ షూటింగ్ కి గ్యాప్ ఇవ్వనున్నారు. ఈ గ్యాప్ లో ‘దృశ్యం 2’ని పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాలో వెంకీ భార్యగా మీనా కనిపించనుంది.

మొత్తానికి వెంకటేష్ ఈ ఏడాది మూడు సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడన్నమాట. యంగ్ హీరోలతో పోటీగా వెంకీ వరుస సినిమాలు రిలీజ్ చేస్తుండడం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus