Venkatesh: ఆరు భాషలలో రీమేక్ చేసిన వెంకటేష్ ఎంటో తెలుసా..!

మూవీ మొఘల్ రామానాయుడు తనయుడిగా ఇండస్ట్రీలోకి వచ్చి వరుస హిట్లు కొట్టి విక్టరీనే ఇంటి పేరు చేసుకున్న హీరో వెంకటేష్. ఆయన సినిమా అంటే ఏవరేజ్ గ్యారెంటీ. దీంతో ఆయనతో సినిమాలు తీసేందుకు చాలా మంది నిర్మాతలు వెనకాడరు. ఎందుకంటే పెట్టిన పెట్టుబడి కచ్చితంగా వస్తుందని వారి నమ్మకం. ఆయన కామెడీ టైమింగ్ ఎక్స్ లెంట్.. నటన హైలెట్ అందుకే టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ అందుకున్నారు. ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా ఆయన క్రేజ్ తగ్గలేదు.

పైగా యంగ్ గా ఉన్నప్పుడు ఎలా ఎనర్జిటిక్ గా ఉన్నారో ఇప్పుడూ అదే మెయింటైన్ చేస్తున్నారు. ఎంతో మంది హీరోయిన్లతో సక్సెస్ ట్రాక్ ఉంది వెంకటేష్ కు. వారిలో ఆన్ స్క్రీన్ సూప‌ర్ హిట్ జోడీగా పేరొందారు విక్ట‌రీ వెంక‌టేష్‌, సౌంద‌ర్య. అప్ప‌ట్లో వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో వచ్చిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. వీరి కాంబోలో సినిమా వ‌స్తోందంటే ప్రేక్ష‌కుల‌కు థియేట‌ర్ల‌కు ప‌రుగులు పెట్టే వారు. వెంకీ సౌందర్య జోడీకి స‌ప‌రేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది.

వారిద్దరు కలిసి అర డ‌జ‌న్ కు పైగా చిత్రాల్లో నటించారు. వెండిత‌ర‌పై (Venkatesh) వెంక‌టేష్‌, సౌంద‌ర్య మ‌ధ్య కెమిస్ట్రీ సూపర్ గా ఉండేది. వ‌రుసగా వారిద్దరు కలసిన సినిమాలు చేయడంతో వారి మధ్య ఏదో ఉందంటూ పుకార్లు కూడా వచ్చాయి. అసలు మేటర్లోకి వెళితే వెంకీ సౌందర్య కాంబినేషన్లో వచ్చిన సినిమా ఏకంగా ఆరు భాషల్లో రీమేక్ అయింది. అప్పట్లో అదో రికార్డు. ఈ సినిమానే పవిత్ర బంధం. దిగ్గజ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య ఈ సినిమాను తెరకెక్కించారు.

ఎంఎం కీరవాణి సినిమాకు సంగీత స్వరాలు సమకూర్చారు. 1996లో విడుద‌లైన ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమాను ఒరియా, కన్నడ, హిందీ, బెంగాలీ బంగ్లాదేశ్‌, తమిళంలో రీమేక్ చేశారు. రీమేక్ చేసిన ప్రతి లాంగ్వేజ్ లో సినిమా హిట్.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus